Hari Hara Veera Mallu: పవన్‌ సినిమా నుంచి పవర్‌ ప్యాక్డ్‌ సర్‌ప్రైజ్‌.. అదిరిపోయిన యాక్షన్‌ సీక్వెన్స్‌ షూట్ వీడియో..

|

Apr 09, 2022 | 6:50 PM

Pawan Kalyan: గతేడాది వకీల్‌సాబ్‌తో ఇండస్ట్రీకొట్టిన పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఈసారి భీమ్లానాయక్‌ తో బాక్సాఫీస్‌పై దండెత్తాడు.

Hari Hara Veera Mallu: పవన్‌ సినిమా నుంచి పవర్‌ ప్యాక్డ్‌ సర్‌ప్రైజ్‌.. అదిరిపోయిన యాక్షన్‌ సీక్వెన్స్‌ షూట్ వీడియో..
Harihara Veeramallu
Follow us on

Pawan Kalyan: గతేడాది వకీల్‌సాబ్‌తో ఇండస్ట్రీకొట్టిన పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఈసారి భీమ్లానాయక్‌ తో బాక్సాఫీస్‌పై దండెత్తాడు. సాగర్‌ కే. చంద్ర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పవర్‌స్టార్‌ స్టామినాను మరోసారి చాటిచెప్పింది. కాగా ఈ సినిమా తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న పవన్‌ తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టాడు. అందులో భాగంగా క్రిష్‌ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) షూటింగ్‌ సెట్‌లోకి మళ్లీ అడుగుపెట్టాడు. చారిత్రక కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవర్‌స్టార్‌ వజ్రాల దొంగగా కనిపించనున్నట్లు సమాచారం. ఇందులో యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం పవన్‌ రిహార్సల్స్‌ ప్రారంభించారు. ప్రముఖ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ టోడర్‌ లాజరోవ్‌తో కలిసి కొన్ని పోరాట సన్నివేశాలు ప్రాక్టీస్‌ చేశారు. వీటికి సంబంధించిన ఫొటోలను చిత్ర బృందం సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అవికాస్తా వైరల్‌గా మారాయి. తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే వీడియో ఒకటి విడుదల చేశారు చిత్ర యూనిట్. పవన్ కళ్యాణ్ ఫైట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ‘ది వారియర్స్ వే’ పేరుతో విడుదల చేసింది.

కాగా హైదరాబాదులో వేసిన భారీ సెట్టింగుల మధ్య పవన్ పై గత కొన్నిరోజులుగా పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆయా సన్నివేశాలకు ముందు పవన్ ఏ విధంగా సాధన చేశారన్నది ఈ ప్రీ షూట్ వీడియోలో చక్కగా చూపించారు. ఈ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాగా హరిహర వీరమల్లు సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఎం.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్‌ హీరోయిన్గా నటిస్తుండగా.. అర్జున్‌ రామ్‌పాల్‌, నర్గీస్‌ఫక్రి, ఆదిత్య మేనన్‌, శుభలేక సుధాకర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, మలయాళం భాషల్లో సినిమా విడుదల కానుంది.

Also Read: KKR vs DC IPL 2022 Match Preview: గత సీజన్‌లో ఒకే జట్టులో.. నేడు ప్రత్యర్థులుగా బరిలోకి.. రికార్డులు ఎలా ఉన్నాయంటే?

Imran Khan: “ఇమ్రాన్ ఖాన్ మానసిక వ్యాధిగ్రస్థుడు.. ఆయన తీరుతో దేశం స్తంభించిపోయింది”.. విపక్షాల ఘాటు వ్యాఖ్యలు

DEBIT LOAD: రాష్ట్రాల రుణాలు దేశానికి అరిష్టం.. లంక సంక్షోభం గుణపాఠం కావాలి కానీ రాష్ట్రాల తీరే విఘాతం!