Bheemla Nayak : కేసీఆర్ సార్ హ్యాట్సాఫ్.. విజయవాడలో చర్చనీయాంశంగా భీమ్లానాయక్ ఫ్లెక్సీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా థియేటర్స్ లో అరుపులు పుట్టిస్తుంది. పవర్ స్టార్ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Bheemla Nayak : కేసీఆర్ సార్ హ్యాట్సాఫ్.. విజయవాడలో చర్చనీయాంశంగా భీమ్లానాయక్ ఫ్లెక్సీ
Pawan Kalyan, Kcr

Updated on: Feb 26, 2022 | 6:30 PM

Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా థియేటర్స్ లో అరుపులు పుట్టిస్తుంది. పవర్ స్టార్ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన భీమ్లానాయక్ సినిమాలో పవన్ రానా పోటీపడి నటించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు రీమేక్ గా భీమ్లానాయక్ తెరకెక్కింది. ఫిబ్రవరి 25 ( శుక్రవారం )ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాలనుంచి భీమ్లానాయక్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా విడుదల సమయంలో పవన్ అభిమానులు భారీ కటౌట్ లు ఫ్లక్సీ లను ఏర్పాటు చేశారు. అయితే విజయవాడలో ఓ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది.

కృష్ణలంక లో ఆసక్తి రేపుతున్న పవన్ అభిమానులు భీమ్లానాయక్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, వంగవీటి మోహనరంగా, పవన్ కళ్యాణ్ ఫొటోలతో భారీ ఫ్లెక్సీ ను ఏర్పాటు చేశారు. మధ్యలో కేటిఆర్, తలసాని, వంగవీటి రాధాకృష్ణ, నాదెండ్ల మనోహర్ చిత్రాలు కూడా ఉన్నాయి. కేసిఆర్ ను ఉద్దేశించి హ్యాట్సాఫ్ సీఎం సార్ అంటూ దానిపై రాయించారు పవన్ అభిమానులు. ఇప్పుడు ఈ ఫ్లెక్సీ విజయవాడలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఏపీలో భీమ్లానాయక్ సినిమాకు ఐదో షోకు అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే.. అలాగే టికెట్ రేట్లను కూడా అక్కడ పెంచలేదు. దాంతో కొందరు అభిమానులు ఏపీ ప్రభుత్వం కావాలనే పవన్ సినిమా పై కక్ష సాదిస్తుందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆంక్షలతో ఇబ్బందులు పెడుతున్న ఏపీ ప్రభుత్వానికి కౌంటర్ గానే విజయవాడలో ఇలా ఫ్లెక్సీఏర్పాటు చేశారనే  ప్రచారం జరుగుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Meenakshi Chaudhary: అందాలు ఆరబోస్తున్న మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటో గ్యాలరీ.

Shilpa Shetty: వయసు తో పాటు పెరుగుతున్న అందం.. శిల్పా శెట్టి లేటెస్ట్ ఫోటోస్

Viral Photo: అందంతో గుండెల్లో హీట్ పుట్టించగలదు.. శివంగిలా ఫైట్ చేయగలదు.. ఎవరో గుర్తించారా..?