AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Animal OTT: నాన్న అనే పదం ‘యానిమల్’ సినిమాలో ఎన్నిసార్లు వాడారో తెలుసా?

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్​ ఫిల్మ్​ 'యానిమల్​'. పక్కా యాక్షన్ బ్యాక్​డ్రాప్​తో ఫాదర్ అండ్ సన్​ ఎమోషన్​ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. సినిమా గురించి చాలా మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

Animal OTT: నాన్న అనే పదం 'యానిమల్' సినిమాలో ఎన్నిసార్లు వాడారో తెలుసా?
Ranbir Kapoor, Anil Kapoor
Ram Naramaneni
|

Updated on: Jan 27, 2024 | 7:01 PM

Share

యానిమల్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్‌లో చూడనివారు ఈ వీకెండ్ ఈ సినిమాని చూసి మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు. మన తెలుగు డైరెక్టర్ సందీప్ వంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలసిందే. రష్మిక మందనా హీరోయిన్‌గా నటించింది. తండ్రీ కొడుకుల ఎమోషన్‌ను ఈ సినిమాలో ప్రధానంగా చూపించారు డైరెక్టర్. మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టించింది. ప్రజంట్ నెట్టింట ఓ ట్రెండ్ నడుస్తోంది. ఏదైనా మూవీ ఓటీటీలోకి వచ్చిన వెంటనే అందులోని ప్రధాన అంశాలతో మీమ్స్ తెగ సర్కులేట్ చేస్తున్నారు క్రియేటర్స్. వాటిని మూవీ లవర్స్ బాగా లైక్  చేస్తున్నారు.

ఈ క్రమంలోనే యానిమల్​ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫాదర్​ ఎమోషన్​తో వచ్చిన ఈ సినిమాలో ‘నాన్న’ అనే పదం చాలాసార్లు వినిపిస్తుంది. ఇప్పుడా నాన్న అనే పదం మొత్తం ఎన్ని సార్లు ఉపయోగించారో లెక్క తేల్చారు నెటిజన్లు. మొత్తం 196 సార్లు వాడినట్లు ఓ ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు. సినిమా మొత్తంలో ఎన్నిసార్లు నాన్న పదం వాడారు? ఎప్పుడెప్పు వాడారు? వంటివి సీన్స్​తో 1:26 నిమిషాల లెంగ్త్‌తో వీడియో ఉంది. హిందీ వర్షన్​కు సంబంధించి ఈ వీడియోను కట్ చేశారు. ఇక తెలుగు డబ్బింగ్​లోనూ ఇంచుమించు అన్ని సార్లే వాడి ఉండొచ్చని అంటున్నారు.

ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి…

ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్, పృథ్వీరాజ్ వంటి వాళ్ళు కీలక పాత్రల్లో కనిపించారు. అనిల్ కపూర్​ తండ్రి పాత్రలో, బాబీ దేఓల్​ విలన్ పాత్రలో నటించారు.