
మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ చాలా గ్యాప్ ఇచ్చారు. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన సర్కారు వారి పాట సినిమా ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు మహేష్. అతడు, ఖలేజా సినిమాలతర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరెకెక్కిస్తున్నారు గురూజీ. ఇక ఈ సినిమా షూటింగ్ నుంచి లీక్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే మహేష్ ఈ సినిమాలో సాలిడ్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. రీసెంట్ గా ఈ సినిమానుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
ఈ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఒక్క పోస్టర్ తోనే సినిమా పై భారీ అంచనాలను నెలకొనేలా చేశారు త్రివిక్రమ్. ఇక ఈ సినిమాకు సంబంధించి రకరకాల టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఇక ఈ మూవీకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది.
మహేష్ సినిమా ఓవర్సీస్ హక్కులు రూ. 14.50 కోట్లకు అమ్ముడు పోయాయని టాక్ వినిపిస్తోంది. మహేష్ సినిమాలకు మాములుగానే అక్కడ భారీ బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు ఈ సినిమా కూడా రికార్డ్ స్థాయిలో బిజినెస్ చేస్తోందని తెలుస్తోంది.ఇక 2024 జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్ త్రివిక్రమ్ తర్వాత మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.