Oscar Awards 2023: అందరి చూపు ఆస్కార్ వైపే.. ప్రపంచ వేదికపై తెలుగు సినిమా సత్తా..

|

Mar 12, 2023 | 10:44 AM

మార్చి 13న జరగబోయే ఈ అవార్డ్ ప్రధానోత్సవ వేడుకల కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.

Oscar Awards 2023: అందరి చూపు ఆస్కార్ వైపే.. ప్రపంచ వేదికపై తెలుగు సినిమా సత్తా..
Rrr, Osars
Follow us on

వరల్డ్‌వైడ్‌గా ఆస్కార్‌ అవార్డ్స్ సందడి నెలకొంది. మరికొద్ది గంటల్లో ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగా వైభవంగా జరగబోతోంది. ఇప్పటికే అమెరికాలో లాస్ ఏంజిల్స్‏లోని డాల్బీ థియేటర్ సిద్దమయ్యింది. ప్రపంచ వేదికపై మన తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ సత్తా చాటబోతోంది. ఈ మూవీలోని నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది. ఆస్కార్ అవార్డ్ కోసం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన ఈ పాటకు అవార్డ్‌ రావాలని కోరుకుంటున్నారు తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు అందరి చూపు ఆస్కార్ అవార్డ్ పైనే ఉంది. మార్చి 13న జరగబోయే ఈ అవార్డ్ ప్రధానోత్సవ వేడుకల కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.

మరోవైపు.. ఆస్కార్‌ అవార్డుకు అడుగు దూరంలో నిలిచిన ట్రిపుల్‌ ఆర్‌ టీమ్‌కి…తెలుగు రాష్ట్రాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది రోజులుగా ఈ మూవీ టీమ్‌ అమెరికాలో సందడి చేస్తున్నారు. దర్శకుడు రాజమౌళితోపాటు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. అమెరికా మీడియాతో వరుస ఇంటర్వ్యూలు చేస్తూ.. నాటు నాటు.. ఆర్ఆర్ఆర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటున్నారు. దేశ గౌరవాన్ని గుండెల్లో నిలుపుకుని రెడ్ కార్పెట్ పైకి వెళ్తామంటూ ఇంటర్నేషనల్ మీడియాలో ముచ్చటించారు. అక్కడి NRIలతో కలిసి నాటునాటు సాంగ్‌కు స్టెప్పులేశారు రామ్‌ చరణ్‌.

ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో నామినేట్‌ అయిన నాటునాటు సాంగ్‌కు ఆస్కార్‌ తప్పకుండా వస్తుందని గంపెడు ఆశలతో ఉన్నారు అభిమానులు. ఇప్పటికే నాటు నాటు పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు లభించింది. అలాగే హాలీవుడ్ ఫిలిం క్రిటిక్ ఛాయిస్ అవార్డ్ సైతం అందుకుంది. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్‌ ఫీవర్‌ కుదరిపేస్తోంది. ప్రపంచ సినీవేదికపై తెలుగు ఖ్యాతిని వెలుగెత్తి చాటాలంటూ.. ట్రిపుల్‌ టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు అభిమానులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.