Oscars 2021: క‌నిపించ‌ని భారతీయ సినిమా ఉనికి.. గ్లోబల్ రేంజ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ ను స్మరించుకున్న‌ ఆస్కార్ వేదిక

|

Apr 27, 2021 | 7:57 PM

ఆస్కార్ అంటే.. ఆ సౌండే వేరు కదా..! కానీ ఈసారి ఆ సౌండే కాదు.. కనీసం ఆస్కార్ మార్క్ మేజిక్ లేకుండానే జరిగిపోయింది ఆస్కార్ పండగ. ఎస్... మాయదారి కోవిడ్ కారణంగా..

Oscars 2021: క‌నిపించ‌ని భారతీయ సినిమా ఉనికి.. గ్లోబల్ రేంజ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ ను స్మరించుకున్న‌ ఆస్కార్ వేదిక
Irfan Khan
Follow us on

ఆస్కార్ అంటే.. ఆ సౌండే వేరు కదా..! కానీ ఈసారి ఆ సౌండే కాదు.. కనీసం ఆస్కార్ మార్క్ మేజిక్ లేకుండానే జరిగిపోయింది ఆస్కార్ పండగ. ఎస్… మాయదారి కోవిడ్ కారణంగా.. కొద్దిగానైనా సందడి లేకుండా నిరాడంబరంగా ముగిసింది 93వ ఆస్కార్ అవార్డుల వేడుక. అమెరికన్ ఫిక్షనల్ డ్రామా… నో మ్యాడ్ ల్యాండ్. ఇదీ ఈసారి ప్రపంచం మెచ్చిన ఉత్తమ సినిమా. ట్వంటీ ఫస్ట్ సెంచరీలో అమెరికా ఎలా కష్టాల నుంచి బైటపడింది అనే థీమ్ తో ఒక చైనీస్ మహిళ తీసిన ఈ మూవీకే దక్కింది బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డ్. ఇక.. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫిమేల్ లీడ్ యాక్ట్రెస్ కేటగిరీస్ కూడా ఈ సినిమా ఖాతాలోకే వెళ్లాయి.

‘ది ఫాదర్’ మూవీలో లీడ్ రోల్ చేసిన ఆంథోనీ హాప్కిన్స్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ ని ఎగరేసుకుపోయింది.. టెనెట్ మూవీ. ఏదైతేనేం కోడక్ థియేటర్లో కనిపించాల్సిన ఆ అట్టహాసాన్ని పూర్తిగా మిస్సయింది సినిమా ప్రపంచం. ఇండియన్ సినిమా ఉనికి లేకపోయినా… గ్లోబల్ రేంజ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ ను స్మరించుకుంది ఆస్కార్ వేదిక.

Also Read: మదనపల్లి జంట హత్యల కేసు : నిందితులకు బెయిల్ మంజూరు.. అదనపు జిల్లా జడ్జి సంచలన నిర్ణయం..

ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. కొత్తగా 11,434 పాజిటివ్‌ కేసులు..