ప్రియా వారియర్‌పై దర్శకుడి ఆరోపణలు

కన్నుగీటే సీన్‌తో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా క్రేజ్‌ను సంపాదించుకున్న మలయాళ కుట్టీ ప్రియా వారియర్‌ ఇప్పుడు తన గౌరవాన్ని క్రమంగా కోల్పోతుంది. మొన్నటికి మొన్న ప్రియ సహనటి నూరిన్ ఆమెపై కామెంట్లు చేయగా.. తాజాగా దర్శకుడు ఒమర్ లులూ ఆరోపణలు చేశాడు. దర్శకుడు అన్న గౌరవం కూడా ప్రియ తనకు ఇవ్వలేదని అతడు పేర్కొన్నాడు. ప్రియకు వచ్చిన క్రేజ్ దృష్ట్యా బలవంతంగా సినిమా కథను మార్చాల్సి వచ్చిందని ఒమర్ అన్నాడు. అందుకే సినిమా ఫ్లాప్ అయిందని.. పైగా ఒక్కసారిగా […]

ప్రియా వారియర్‌పై దర్శకుడి ఆరోపణలు

Edited By:

Updated on: Mar 11, 2019 | 1:20 PM

కన్నుగీటే సీన్‌తో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా క్రేజ్‌ను సంపాదించుకున్న మలయాళ కుట్టీ ప్రియా వారియర్‌ ఇప్పుడు తన గౌరవాన్ని క్రమంగా కోల్పోతుంది. మొన్నటికి మొన్న ప్రియ సహనటి నూరిన్ ఆమెపై కామెంట్లు చేయగా.. తాజాగా దర్శకుడు ఒమర్ లులూ ఆరోపణలు చేశాడు. దర్శకుడు అన్న గౌరవం కూడా ప్రియ తనకు ఇవ్వలేదని అతడు పేర్కొన్నాడు.

ప్రియకు వచ్చిన క్రేజ్ దృష్ట్యా బలవంతంగా సినిమా కథను మార్చాల్సి వచ్చిందని ఒమర్ అన్నాడు. అందుకే సినిమా ఫ్లాప్ అయిందని.. పైగా ఒక్కసారిగా వచ్చిన క్రేజ్‌తో ప్రియ తనను లెక్కచేయలేదని చెప్పుకొచ్చాడు. ప్రియా కంటే ఈ సినిమాలో నటించిన మరో హీరోయిన్ నూరిన్ మంచి నటి అంటూ ఒమర్ కితాబిచ్చాడు. అయితే తనను పరిచయం చేసిన దర్శకుడే వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో ప్రియ కెరీర్ డైలమాలో పడింది. ఇప్పటికే మలయాళంలో ఆమె రెండు సినిమాలు మిస్ చేసుకుంది.

Follow Us