Oru Adaar Love: ప్రియుడిని పెళ్లి చేసుకున్న ‘ఒరు ఆధార్ లవ్’ హీరోయిన్.. సందడి చేసిన రామారావు బ్యూటీ..

2019లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై అతి పెద్ద విజయం సాధించిన చిత్రం ఒరు ఆధార్ లవ్. అప్పట్లో ఈ మూవీ పెద్ద సంచలనం సృష్టించింది. ఇందులో యువ నటీనటులు ప్రియా ప్రకాష్ వారియర్, మహ్మద్ రోషన్ నూర్ షరీఫ్ ప్రధాన పాత్రలు పోషించారు.

Oru Adaar Love: ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఒరు ఆధార్ లవ్ హీరోయిన్.. సందడి చేసిన రామారావు బ్యూటీ..
Noorin Shereef

Updated on: Jul 26, 2023 | 10:03 AM

సినీపరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకుంటారు. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారు. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసి బ్రేక్ తీసుకుంటారు. ఫస్ట్ మూవీ తర్వాత వరుస ఆఫర్స్ వచ్చినప్పటికీ కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటుంటారు. మరికొందరు సినిమాలకు దూరంగా ఉండిపోతారు. అలాంటి వారిలో హీరోయిన్ నూరీన్ షరీఫ్ ఒకరు. 2019లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై అతి పెద్ద విజయం సాధించిన చిత్రం ఒరు ఆధార్ లవ్. అప్పట్లో ఈ మూవీ పెద్ద సంచలనం సృష్టించింది. ఇందులో యువ నటీనటులు ప్రియా ప్రకాష్ వారియర్, మహ్మద్ రోషన్ నూర్ షరీఫ్ ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ సినిమాలో కన్నుకొట్టే సీన్‏తో ఫుల్ క్రేజ్ కొట్టేసింది ప్రియా. ఆ తర్వాత ఎక్కువగా ఫేమస్ అయ్యింది నూర్. ఉంగరాల ముంగురులతో.. కలువ కళ్లతో కుర్రకారును కట్టిపడేసింది ఈ బ్యూటీ. మలయాళంలోనే కాదు.. తెలుగులోనూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా తర్వాత పలు చిత్రాల్లో నటించింది నూర్. కానీ తెలుగులో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేకపోయింది. తాజాగా ఈ బ్యూటీ తన ప్రియుడు నటుడు కమ్ స్క్రీన్ రైటర్ ఫహీమ్ జాఫర్‏ను వివాహం చేసుకున్నారు. నూర్, ఫహీమ్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి వివాహం జూలై 24న తిరువనంతపురంలో జరగ్గా.. ఈ వేడుకకు నటీనటుులు అహానా కృష్ణ, రామారావు ఆన్ డ్యూటీ హీరోయిన్ రజిషా విజయన్, ప్రియా ప్రకాష్ వారియర్, శరణ్య మోహన్ పాల్గొన్నారు. నూర్ పెళ్లి వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.