Naatu Naatu Song: నాటు నాటు పాటకు స్టెప్పులేసిన ‘ఓరి దేవుడా’ హీరోయిన్స్.. ఎంత అందంగా చేశారో చూశారా ?..

|

Oct 26, 2022 | 9:50 AM

ఓరి దేవుడా మూవీ సక్సెస్ సంబరాల్లో భాగంగా.. హీరోయిన్స్ మిథాలా పాల్కర్.. ఆశా భట్ కలిసి ట్రిపుల్ ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు స్టెప్పులేశారు.

Naatu Naatu Song: నాటు నాటు పాటకు స్టెప్పులేసిన ఓరి దేవుడా హీరోయిన్స్.. ఎంత అందంగా చేశారో చూశారా ?..
Mithali, Asha Bhatt
Follow us on

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి చెప్పక్కర్లేదు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకోవడమే కాకుండా.. మరోసారి తెలుగు సినిమా స్థాయిని పెంచేసింది. ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రస్తుతం జపాన్‏లో స్క్రీనింగ్ అవుతుంది. జక్కన్నతోపాటు..చరణ్.. ఎన్టీఆర్ కూడా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఓటీటీలోనూ అత్యధిక వ్యూస్‏తో దూసుకుపోయిన ఈ సినిమాలోని సాంగ్స్ సైతం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. సామాన్యులే కాకుండా సెలబ్రెటీలు కూడా ఈ చిత్రంలోని పాటలకు స్టెప్పులేశారు. అయితే ఈ మూవీ రిలీజ్ అయి ఏడు నెలలు కావోస్తున్నా.. ట్రిపుల్ ఆర్ ఫీవర్ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా ఇందులోని నాటు నాటు పాటలోని సిగ్నేచర్ స్టెప్ ఎంతగా వైరల్ అయ్యిందో తెలిసిన విషయమే.

చిన్న.. పెద్ద తేడా లేకుండా నాటు నాటు సాంగ్ సిగ్నేచర్ స్టెప్పుకు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. తాజాగా ఓరి దేవుడా మూవీ హీరోయిన్స్ కూడా ఈ పాటకు అందంగా స్టె్ప్పులేశారు. ఓరి దేవుడా మూవీ సక్సెస్ సంబరాల్లో భాగంగా.. హీరోయిన్స్ మిథాలా పాల్కర్.. ఆశా భట్ కలిసి ట్రిపుల్ ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు స్టెప్పులేశారు. మిథాలా చీరలో.. ఆశా భట్ లెహాంగాలో దీపావళి కాంతుల్లో నాటు నాటు లెగ్ స్వింగ్ స్టెప్పులేశారు. ఈ వీడియోను మిథాలా తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. నాటు నాటు విత్ మై పార్టనర్ ఇన్ క్రైమ్..అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్.. మిథాలా పాల్కర్ జంటగా నటించిన ఓరి దేవుడా చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది ఈ మూవీ. ఇందులో విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.