కేరళ రాష్ట్రం సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ప్రతీక ఓనం పండగ. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని ఎంత ఘనంగా జరుపుకొంటారో మలయాళీలు అంతే వైభవంగా ఓనం ఫెస్టివల్‌ను సెలబ్రేట్ చేసుకుంటారు. కేవలం కేరళ రాష్ట్రల ప్రజలే కాదు సరిహద్దుల్లో ఉండే తమిళనాడు, కర్ణాటక సహా పలు రాష్ట్రాల ప్రజలు కుడా ఈ పండగను జరుపుకొంటారు. ఏటా ఆగస్టు-సెప్టెంబర్ నెలలో వచ్చే ఓనం ఫెస్టివల్‌ను సుమారు 10 రోజుల పాటు అత్యంత వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ క్రమంలో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతున్న అందాల తారలు సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోయారు. యాంకర్ కనకాల సుమ , మహానటి కీర్తి సురేష్, అనుపమా పరమేశ్వరన్, నజియా నజ్రీమ్, మంజు వారియర్, మడోన్నా సెబాస్టియన్, కల్యాణి ప్రియదర్శన్, హనీ రోజ్, మాళవికా మోహనన్, మమతా మోహన్ దాస్, అనిఖా సురేంద్రన్, గౌరీ కిషన్.. తదితర మలయాళ ముద్దుగుమ్మలు ట్రెడిషినల్ లుక్‌లో సందడి చేశారు. మరి ఆ ఫొటోలపై ఓ లుక్కేద్దాం రండి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..