Priyanka Mohan: ‘ఓజీ’ సక్సెస్ జోష్‌లో ఉన్న ప్రియాంకకు షాక్.. నెట్టింట అలాంటి ఫొటోలు.. వారికి స్ట్రాంగ్ ఇచ్చిన హీరోయిన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమాలో హీరోయిన్ గా నటించింది కోలీవుడ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్. పవన్ భార్య కణ్మణి పాత్రలో అద్భుతంగా నటించింది. ప్రస్తుతం ఓజీ సక్సెస్ జోష్ లో ఉందీ అందాల తార. అయితే ఇంతలోనే ఈ బ్యూటీకి బిగ్ షాక్ తగిలింది.

Priyanka Mohan: ఓజీ సక్సెస్ జోష్‌లో ఉన్న ప్రియాంకకు షాక్.. నెట్టింట అలాంటి ఫొటోలు.. వారికి స్ట్రాంగ్ ఇచ్చిన హీరోయిన్
Priyanka Mohan

Updated on: Oct 11, 2025 | 12:32 PM

ఏఐ టెక్నాలజీతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలియదు కానీ సెలబ్రిటీలు మాత్రం దీనితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఆకతాయిలు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి స్టార్ సెలబ్రిటీల మార్ఫింగ్ ఫొటోలు క్రియేట్ చేస్తున్నారు. డీప్ ఫేక్ వీడియోలను రూపొందించి నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే రష్మిక మందన్నా, అలియాభట్ వంటి స్టార్ సెలబ్రిటీలు ఈ మార్ఫింగ్ ఫొటోలు, వీడియోల బారిన పడ్డారు. తాజాగా ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ మార్ఫింగ్ ఫొటోలు కొన్ని నెట్టింట బాగా వైరలవుతున్నాయి.
తను స్నానానికి వెళ్తున్నప్పుడు తీసుకున్న సెల్ఫీలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రియాంక బాత్రూమ్‌ ఫోటోలు లీక్ కొందరు అదే పనిగా ఈ ఫొటోలను షేర్ చేస్తున్నారు. వాస్తవంగా ఈ ఫోటోలు అన్నీ కూడా AI తో క్రియేట్‌ చేసినవే. కానీ చాలా మంది అవి నిజమైన ఫొటోలేనని అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ ఫొటోలపై నేరుగా ప్రియాంకనే స్పందించింది. తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల వేదికగా ఒక పోస్ట్ పెట్టింది.

‘ఇలాంటి నకిలీ ఫొటోలను షేర్ చేయడం, వైరల్‌ చేయడం ఇకనైనా ఆపేయండి. నన్ను తప్పుగా చిత్రీకరించే కొన్ని AI-జనరేటెడ్ ఫొటోలు నెట్టింట సర్క్యులేట్ అవుతున్నాయి. దయచేసి వీటిని షేర్‌ చేయడం ఆపేయండి. AIని నైతిక సృజనాత్మకత కోసం మాత్రమే వినియోగించాలి. ఇలాంటి తప్పుడు సమాచారం కోసం కాదు ఉపయోగించవద్దు. మనం ఏమి క్రియేట్‌ చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎలాంటి వాటిని ఇతరులతో పంచుకుంటున్నాం అనేదాని గురించి జాగ్రత్తగా ఉండండి. అందరికీ ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చింది ప్రియాంక.

ఇవి కూడా చదవండి

ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ ట్వీట్..

ఓజీ హీరోయిన్ షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ విషయంలో అందరూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఫేక్ ఫొటోలు, వీడియోలు క్రియేట్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఓజీ సినిమా సెట్ లో హీరోయిన్ ప్రియాంక మోహన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.