విజయ్ ఆంటోని.. మ్యూజిక్ డైరెక్టర్ నుంచి కథానాయకుడిగా మారిన వ్యక్తి. అది కూడా ప్రయోగాత్మక సినిమాలతో తనకంటూ ప్రత్యేకతను సృష్టించుకున్నాడు. బిచ్చగాడు సినిమాతో తెలుగులోనూ విపరీతంగా పాపులర్ అయ్యాడు. మదర్ సెంటిమెంట్‌తో వచ్చిన ఆ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. చాలాకాలం తర్వాత దానికి కొనసాగింపుగా బిచ్చగాడు 2తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు ఆంటోని. ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్‌ను ప్రధానమైన అంశంగా తీసుకున్నారు. ఈ మూవీ అటు తమిళ్‌లోనూ, ఇటు తెలుగులోనూ మంచి హిట్ అయ్యింది. ఈ మూవీ త్వరలో ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ నెల 18 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవ్వనుంది.
తమిళ్, తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాను చూడొచ్చు. కాగా ఈ సినిమాను తెలుగులో బాగా ప్రమోట్ చేశాడు ఆంటోని. పలు ప్రాంతాల్లో బిచ్చగాళ్లకు ‘యాంటీ బికిలీ’ పేరుతో చెప్పులు, అద్దం, సబ్బు, దువ్వెన, పౌడర్, నూనె బాటిల్, విసనకర్ర, దుప్పటి, గొడుగు ఉన్న కిట్ల అందజేశాడు. ఇప్పటికే విజయ్ ఆంటోని సినిమాలు అంటే చూడాలిరా బై అనే జనాలు తెలుగులోనూ ఉన్నారు. త్వరలో ఈ హీరో కూడా సూర్య, కార్తీ రేంజ్ మార్కెట్ తెలుగులోనూ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సబ్జెక్ట్ సెలక్షన్ ఇలానే ఉంటే.. కచ్చితంగా టాలీవుడ్‌లోనూ విజయ్ మార్కెట్ మరింతగా విస్తరిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి