కరోనా వ్యాప్తి నెమ్మదించింది. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో థియేటర్లు ఓపెన్ అయ్యాయి. దీంతో మేకర్స్ తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. అనివార్య కారణాల వల్ల కొన్ని సినిమాలు ఓటీటీ వేదికలుగా ప్రేక్షకులను పలుకరిస్తున్నాయి. అసలే రాబోయేది పండుగ సీజన్. సెలవలు కూడా ఉంటాయి. దీంతో దర్శకనిర్మాతలు తమ సినిమాలకు తుది మెరుగులు దిద్ది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అయ్యారు. మరి ఈ వారం ప్రేక్షకులను అలరించే ఆ చిత్రాలేంటో తెలుసుకుందాం పదండి.
‘కొండపొలం’
ఉప్పెన సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వైష్ణవ్‌తేజ్ ‘కొండపొలం’ సినిమాతో ఆడియెన్స్‌ను పలుకరించనున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 8న థియేటర్‌లలో రిలీజ్ కానుంది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, ప్రోమోస్ సినిమాపై ఇంట్రస్ట్ పెంచాయి. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు.
‘ఆరడుగుల బుల్లెట్’
ఎప్పుడే రిలీజ్ కావాల్సిన ‘ఆరడుగుల బుల్లెట్’ మూవీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. గోపీచంద్, నయనతార జంటగా నటించిన ఈ చిత్రాన్ని బి.గోపాల్ తెరకెక్కించారు. ప్రస్తుతం అన్ని సమస్యలు సర్దుమణగడంతో అక్టోబర్ 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం కీలకపాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించారు. జయబాలాజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై తాండ్ర రమేశ్ నిర్మించారు.
‘నేను లేని.. నా ప్రేమకథ’
నవీన్‌చంద్ర హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నేను లేని నా ప్రేమకథ’. గాయత్రి ఆర్.సురేష్, అదితి మ్యాకల్ హీరోయిన్స్‌గా నటించారు. సురేష్ ఉత్తరాది దర్శకత్వం వహించారు. కల్యాణ్ కందుకూరి, నిమ్మకాయల దుర్గాప్రసాద్‌రెడ్డి, అన్నదాత భాస్కర్‌రావు నిర్మాతలు. అక్టోబరు 8న ఈ సినిమా థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘వరుణ్ డాక్టర్’
తెలుగులో ఇప్పుడిప్పుడే మార్కెట్ ఏర్పరచుకుంటున్నాడు తమిళ్ హీరో శివ కార్తికేయన్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో తాజాగా అతడు ‘వరుణ్ డాక్టర్’ అనే మెడికల్ క్రైమ్ థ్రిల్లర్‌లో నటించాడు. ప్రియాంక అరుళ్ మోహన్, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. అక్టోబరు 9న ఈ సినిమాను థియేటర్‌లలో విడుదల చేయనున్నారు.
‘రాజరాజ చోర’
కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై ఆడియెన్స్‌కి మంచి వినోదాత్మక చిత్రం ‘రాజ రాజ చోర’. కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ వేదికగా అలరించేందుకు రెడీ అయ్యింది. అక్టోబరు 8 నుంచి ‘జీ 5’లో స్ట్రీమింగ్ కానుంది. శ్రీ విష్ణు హీరోగా హసిత్ గోలి తెరకెక్కించిన సినిమా ఇది. మేఘా ఆకాశ్, సునయన హీరోయిన్స్‌గా నటించారు.
‘భ్రమమ్’
బాలీవుడ్‌లో ఘన విజయాన్ని అందుకుని, ఇప్పుడు చిత్ర పరిశ్రమల్లోనూ సందడి చేసిన, చేయడానికి వస్తున్న చిత్రం ‘అంధాదున్’. ఇప్పటికే తెలుగులో నితిన్ కీలక పాత్రలో ‘మ్యాస్ట్రో’గా విడుదలైన విషయం తెలిసిందే. ఈ వారం మలయాళ ప్రేక్షకులను ‘భ్రమమ్’ పేరుతో అలరించడానికి సిద్ధమైంది. డిఫరెంట్ మూవీస్ చేసే పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. రవి.కె చంద్రన్ దర్శకత్వం వహించారు. హిందీలో టబు పోషించిన పాత్రను మలయాళంలో మమతా మోహన్‌దాస్ చేస్తున్నారు. పృథ్వీ గర్ల్‌ఫ్రెండ్‌గా రాశీఖన్నా కనిపించనుంది. అక్టోబరు 7న అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
‘కోల్డ్ కేస్’
పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘కోల్డ్ కేస్’. తను బాలక్ దర్శకుడు. జూన్ 30న అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మలయాళం భాషలో విడుదలైంది. కాగా, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా వేదికగా అక్టోబరు 8వ తేదీ నుంచి ‘కోల్డ్ కేస్’ స్ట్రీమింగ్ కానుంది. పృథ్వీరాజ్ ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.
నెట్‌ఫ్లిక్స్
అమెజాన్ ప్రైమ్
డిస్నీ+హాట్ స్టార్
సోనీ లివ్
Also Read: నర్మగర్భంగా మరో పోస్ట్ పెట్టిన సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్.. నెట్టింట వైరల్