NTR : చిరంజీవి , బాలకృష్ణ ‘నాటు నాటు’కు డ్యాన్స్‌ వేస్తే దుమ్ములేచిపోతుంది : ఎన్టీఆర్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన సినిమా దేవర. దేవర సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ లో ఉన్నారు. ఎక్కడ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. రాజమౌళి సినిమా తర్వాత ఎక్కడ ఫ్లాప్ పడుతుందో అని అభిమానులు ఆందోళన పడ్డారు. కానీ దేవర సినిమా హిట్ అవ్వడంతో పాటు భారీ కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది.

NTR : చిరంజీవి , బాలకృష్ణ ‘నాటు నాటు’కు డ్యాన్స్‌ వేస్తే దుమ్ములేచిపోతుంది : ఎన్టీఆర్
Ntr, Chiranjeevi, Balakrish

Updated on: May 12, 2025 | 10:34 AM

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు అనేక అవార్డులు కూడా అందుకుంది. ఏకంగా ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు అందుకుంది. ఇప్పటివరకు తెలుగు సినిమా అందుకొని ఘనతను ఆర్ఆర్ఆర్ సినిమా అందుకుంది. లండన్‌లోని ప్రతిష్ఠాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ఆర్‌ఆర్‌ఆర్ లైవ్ కాన్సర్ట్ మే 11, 2025న (ఆదివారం) జరిగింది. ఈ కార్యక్రమం ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి సంబంధించిన ఒక గ్రాండ్ ఈవెంట్, ఇందులో చిత్రం స్క్రీనింగ్‌తో పాటు లైవ్ ఆర్కెస్ట్రా ప్రదర్శన కూడా చేశారు.

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి హాజరయ్యారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఈ కాన్సర్ట్‌లో రాయల్ ఫిల్హార్మోనిక్ కాన్సర్ట్ ఆర్కెస్ట్రాతో కలిసి ఆర్‌ఆర్‌ఆర్ సౌండ్‌ట్రాక్‌ను లైవ్‌గా ప్రదర్శించారు. ఈ ఆర్కెస్ట్రాను బెన్ పోప్ నడిపించారు. ముఖ్యంగా “నాటు నాటు” వంటి ఐకానిక్ ట్రాక్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదే రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో 2019 అక్టోబర్‌లో బాహుబలి: ది బిగినింగ్ చిత్రం కూడా లైవ్ ఆర్కెస్ట్రాతో స్క్రీన్ చేయబడింది, ఇది కీరవాణి మరియు రాజమౌళి టీమ్‌కు మరో గొప్ప విజయాన్ని అందించింది.

కాగా ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. చిరంజీవి, బాలకృష్ణ గురించి ప్రస్తావించారు ఎన్టీఆర్. నాటు నాటు సాంగ్ లో నేను నా బెస్ట్ ఫ్రెండ్ చరణ్ తో కలిసి నటించాను. చరణ్ తండ్రి చిరంజీవి మంచి డాన్సర్ అని అందరికీ తెలుసు.. అలాగే మా బాబాయ్ బాలకృష్ణ కూడా మంచి డాన్సర్. చిరంజీవి గారు, బాలకృష్ణ బాబాయ్ కలిసి నాటు నాటు పాటకు డాన్స్ చేస్తే అది ఓ మంచి జ్ఞాపకంగా చరిత్రలో మిగిలిపోతుంది అని ఎన్టీఆర్ అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.