టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కొరటాల. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, గ్లింప్స్ , మొదటి సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేవర సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మొదటి భాగం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే తారక్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్ర అయినా ఇటే ఒదిగిపోయి నటిస్తారు తారక్. అయితే ఓ సీన్ లో ఆయన ఇష్టం లేకపోయినా కూడా నటించారట.
ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో టెంపర్ మూవీ ఒకటి. ఈ సినిమాలో ఎన్టీఆర్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్స్ లో నటించి మెప్పించారు తారక్. అయితే ఈ సినిమాను తారక్ ఒక్కడే నడిపించారు. ఇక ఈ సినిమాలో తారక్ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి. అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశంలో తనకు నచ్చకపోయినా కూడా నటించారట.
టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ ఒక సన్నివేశంలో తనికెళ్ళ భరణిని బెదిరించి ఆస్తిని రాయించుకుని సన్నివేశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఈ సినీ ఎన్టీఆర్ కు నచ్చలేదట. అయితే పూరిజగన్నాథ్ ఈ సీన్ తర్వాత హీరో ఎలివేషన్, ఎస్టాబ్లిష్ చేసే సీన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయని పూరి తారక్ కు చెప్పి ఒప్పించారట. దాంతో తారక్ అయిష్టంగానే ఈ సీన్ చేశారట. ఇక ఈ సినిమాలో హీరో మొదటి నుంచి నెగిటివ్ రోల్ లో కనిపిస్తాడు. సెకండ్ ఆఫ్ లో హీరో మారిపోవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు పూరి. టెంపర్ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.