
నెట్టింట నిత్యం సినీ సెలబ్రెటీల గురించి ఎదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. తమ సినిమాల విశేషాల గురించి నిత్యం సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు అందాల భామలు.. అలాగే సెలబ్రెటీల వ్యక్తిగత విషయాల గురించి కూడా నిత్యం సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అలాగే ఎవరైనా సెలబ్రెటీ చిన్న పొరపాటు చేసినా.. లేదా నోరుజారి ఏదైనా కామెంట్ చేసినా సోషల్ మీడియాలో పెద్ద రచ్చ అవుతుంది. ఓ రేంజ్‌లో ట్రోల్స్ జరుగుతుంటాయి.ముఖ్యంగా హీరోయిన్స్ గురించి నిత్యం ఎదో ఒకరకంగా ట్రోల్స్ జరుగుతూనే ఉంటాయి. అయితే కొందరు ఈ నెగిటివిటీని పక్కన పెట్టేసి తమ పని తాము చేసుకుంటారు. మరికొందరు మాత్రం తమదైన స్టైల్లో ట్రోలింగ్ పై స్పందిస్తుంటారు. కానీ ఓ ముద్దుగుమ్మ మాత్రం తనను బాడీ షేమింగ్ చేయడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది.
ఆమె మరెవరో కాదు.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మరాఠీ బ్యూటీ శ్రుతి మరాఠే. ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్యగా నటించింది శ్రుతి. అందం, అభినయంతో అడియన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. దేవర సినిమా తర్వాత శ్రుతి గురించి సోషల్ మీడియాలో తెగ గాలించారు నెటిజన్స్. కాగాశ్రుతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
ఇదిలా ఉంటే శ్రుతి మరాఠే తన బరువు గురించి తరచుగా ట్రోలింగ్స్ ఎదుర్కొన్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది ఈ అందాల తార. ఆ ట్రోల్స్ కారణంగా తాను మానసికంగా ఒత్తిడికి గురయ్యానని.. చాలా సంవత్సరాలుగా జనాలు తన బరువు గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని.. దీనివల తనకు చాలా మానసిక క్షోభ కలిగిందని.. దీంతో తనలో కొన్ని మార్పులు చేసుకున్నట్లు తెలిపింది. అలాగే ఆమె మాట్లాడుతూ.. కొందరు మీ శరీరాన్ని ఎప్పుడూ విమర్శిస్తారు. ఒకప్పుడు ‘నువ్వు చాలా లావుగా ఉన్నావు’ అని నన్ను అనేవారు, దాంతో నేను చాలా ఒత్తిడికి లోనయ్యా.. ఆతర్వాత కొన్ని మార్పులు చేసుకున్నా..ఇప్పుడు ‘నువ్వు ఎంత సన్నగా మారిపోయావు’ అని అంటున్నారు. అది వింటే నాకు నవ్వొస్తుంది.. ఎందుకంటే గత 15-20 సంవత్సరాలుగా ఇవే మాటలు విన్నాను. మనం లోపల ఎలా ఫీలవుతున్నామో.. మనకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని ఆలోచించకుండా జనాలు మన బాడీ మీద ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటారు. అది మీ మానసిక ఆరోగ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ ఇప్పుడు నేను ఆ విమర్శలను అసలు పట్టించుకోను అంటూ చెప్పుకొచ్చింది శ్రుతి ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.