NTR 30 Official: బిగ్ అనౌన్సిమెంట్.. కొరటాల దర్శకత్వంలో తారక్ 30వ సినిమా… రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు

|

Apr 12, 2021 | 8:26 PM

నందరమూరి తారక రాామారావు హీరోగా .. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శివ కొరటాల దర్శకత్వంలో కొత్త సినిమా అనౌన్స్ అయ్యింది.   'జనతా గ్యారేజ్'​ వంటి బ్లాక్‌బాస్టర్

NTR 30 Official: బిగ్ అనౌన్సిమెంట్.. కొరటాల దర్శకత్వంలో తారక్ 30వ సినిమా... రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు
Koratala Ntr Film
Follow us on

నందరమూరి తారక రాామారావు హీరోగా .. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శివ కొరటాల దర్శకత్వంలో కొత్త సినిమా అనౌన్స్ అయ్యింది.   ‘జనతా గ్యారేజ్’​ వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత ఆ కలయికలో ఎన్టీఆర్ ​30వ సినిమాగా ఈ మూవీ రాబోతుంది.  ఈ విషయాన్ని స్వయంగా కొరటాల ట్వీట్​ చేశారు. జూన్‌ రెండో వారం నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలు కానుంది. త్వరలోనే నటీనటులు, ఇతర సాంకేతిక బృందం వివరాలను వెల్లడించనున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఏప్రిల్‌ 29, 2022 ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. మరోవైపు ఎన్టీఆర్‌ నటించిన ‘ఆర్ఆర్‌ఆర్‌’, కొరటాల శివ దర్శకత్వం వహించిన ‘ఆచార్య’ చిత్రాలు చిత్రీకరణ తుది దశలో ఉన్నాయి. కాగా తాజా ప్రకటనతో తారక్ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.

‘‘ఏప్రిల్ 29, 2022 వ తేదీన పలు ఇండియన్ లాంగ్వెజస్‌లో ఈ సినిమా విడుదల అవుతుంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌పై మాములుగానే భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా, భారీ స్థాయిలో ఈ సినిమా ఉంటుంది. ఇతర వివరాలను ముహూర్తం రోజున తెలియజేస్తాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు.

Also Read: ఈ గ్రామంలో దశాబ్దం పాటు కేవలం అమ్మాయిలు మాత్రమే పుట్టారు.. విచిత్రమైన స్టోరీ..

శ్రీరామనవమి రోజు ఫ్యాన్స్‌ను ఖుషీ చేయనున్న డార్లింగ్.. ! గట్టిగా ప్లాన్ చేశారుగా..