Jr.NTR-Kalyan Ram: ఎన్టీఆర్ 101వ జయంతి.. నివాళులు అర్పించిన తారక్, కళ్యాణ్ రామ్..

|

May 28, 2024 | 8:22 AM

అటు నటుడిగా.. ఇటు రాజకీయ నాయకుడిగా ప్రత్యేకత చాటుకున్న ఎన్టీఆర్ మరణించి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటికీ తెలుగువారి గుండెల్లో నిలిచ ఉన్నారు. ఎన్టీఆర్ జయంతి.. వర్దంతి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఆయన సేవలను గుర్తుచేసుకుంటారు అభిమానులు. గతేడాది తారక రామారావు శత జయంతి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఎంతో ఘనంగా నిర్వహించారు.

Jr.NTR-Kalyan Ram: ఎన్టీఆర్ 101వ జయంతి.. నివాళులు అర్పించిన తారక్, కళ్యాణ్ రామ్..
Jr.ntr, Kalyan Ram
Follow us on

తెలుగు ప్రజల అభిమాన నటుడు నందమూరి తారక రామారావు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు సినిమాలకు ఓ గుర్తింపు తీసుకువచ్చిన గొప్ప నటుడు. వెండితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఎంతో మంది అభిమానుల హృదయాలలో చెరగని స్థానం సంపాదించుకున్న ఎన్టీఆర్.. సమాజ శ్రేయస్సు కోసం రాజకీయ నాయకుడిగా ప్రజాపాలన చేసి విజయం సాధించారు. అటు నటుడిగా.. ఇటు రాజకీయ నాయకుడిగా ప్రత్యేకత చాటుకున్న ఎన్టీఆర్ మరణించి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటికీ తెలుగువారి గుండెల్లో నిలిచ ఉన్నారు. ఎన్టీఆర్ జయంతి.. వర్దంతి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఆయన సేవలను గుర్తుచేసుకుంటారు అభిమానులు. గతేడాది తారక రామారావు శత జయంతి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఎంతో ఘనంగా నిర్వహించారు.

మే 28న ఎన్టీఆర్ 101 జయంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, అభిమానులు, తెలుగు దేశం నాయకులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ప్రతి ఏడాది ఎన్టీఆర్, నందమురి బాలకృష్ణ కుటుంబసభ్యులు అంతా ఇక్కడే తారక రామారావుకు నివాళులు అర్పిస్తారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద తెల్లవారుజాము నుంచే అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. తారక్, కళ్యాణ్ రామ్ వచ్చిన సమయంలో వారితో ఫోటోస్ దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర, వార్ 2 చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. వార్ 2 చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు తారక్. అలాగే డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ఇందులో తారక్ పూర్తి స్థాయి మాస్ అవతారంలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ లో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.