Game Changer: గేమ్ ఛేంజర్ సినిమాకు చరణ్ కంటే ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా..?

|

Jan 03, 2025 | 5:32 PM

కోలీవుడ్ ఫిల్మ్ మేకర్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తోన్న లేటేస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. మొదటిసారి తెలుగులో నేరుగా తెరకెక్కిస్తోన్న సినిమా ఇది. దీంతో గేమ్ ఛేంజర్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. తమిళ సినిమా కాకుండా తెలుగు సినిమాల్లో దర్శకుడిగా పరిచయం అవుతున్న తొలి సినిమా ఇదే. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Game Changer: గేమ్ ఛేంజర్ సినిమాకు చరణ్ కంటే ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా..?
Ram Charan's Game Changer
Follow us on

పాన్ ఇండియన్ ఫేమస్ యాక్టర్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నారు. ఎస్.శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్ చరణ్‌తో పాటు కియారా అద్వానీ, అంజలి, సముద్రఖని, ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందింది. తెలుగులో దర్శకుడు శంకర్‌కి ఇదే తొలిచిత్రం. నటుడు రామ్ చరణ్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయనున్నారు. 2021 చివరిలో ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ దాదాపు 3 సంవత్సరాలు పట్టింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో జనవరి 10న విడుదల కానుంది. దీంతో కొన్ని రోజులు ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రయూనిట్.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దర్శకుడు శంకర్ ఈ సినిమా కథను ముందుగా కోలీవుడ్ హీరో విజయ్ కు చెప్పాడట. ఈ స్టోరీ నచ్చడంతో నటించేందుకు విజయ్ సైతం ఒకే చెప్పాట. కానీ శంకర్ మాత్రం సినిమాలో నటించేందుకు ఏడాదిన్నర పాటు కాల్షీట్ ఇవ్వాలని కోరాడట. అయితే నటుడు విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అని చెప్పగా, అతను కేవలం ఒక చిత్రానికి 1 సంవత్సరం కంటే ఎక్కువ కాల్షీట్ ఇవ్వలేనని.. ఇక ఆ సినిమా చేయడం కుదరదని చెప్పారట. దీంతో గేమ్ ఛేంజర్ సినిమా నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాతే ఈ సినిమాకు చరణ్ ను సెలక్ట్ చేసినట్లు ఇటీవల ఓ మీడియా సమావేశంలో వెల్లడించాడు డైరెక్టర్ శంకర్.

పూర్తిగా యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్.థమన్ సంగీతం అందించారు. ఈ సినిమా పాటల కోసమే 75 కోట్లు ఖర్చు చేసినట్లు చిత్రబృందం తెలిపింది. దాదాపు రూ.450 కోట్లతో ఈ సినిమాను నిర్మించారు.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.