
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే ఓ మాస్ రాజా ఉన్నాడు.. మాస్ హీరోలు ఎంత మంది ఉన్నా మాస్ రాజా అంటే మాత్రం వెంటనే గుర్తుకొచ్చేది హీరో రవితేజనే. ఇఫ్పుడా బిరుదు కోసం సీరియస్‌గా పోటీ పడుతున్నాడు నేచురల్ స్టార్ నాని. పోటీ పడటం కాదు.. వీలైనంత త్వరలో ఆ చైర్ చేజిక్కించుకోవాలని చూస్తున్నాడు. ఇంత అర్జంట్‌గా నాని మాస్‌పై ఫోకస్ చేయడానికి కారణమేంటి..?
నాని మంచి ఫామ్‌లో కొనసాగుతున్నాడు. 2017 తర్వాత నానికి 2023 బాగా కలిసొచ్చింది. మొదట్లో దసరా, చివర్లో హాయ్ నాన్నతో దాదాపు 170 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసారు ఈ హీరో. ఇదే దూకుడు 2024లో కొనసాగించారు. మొన్నొచ్చిన సరిపోదా శనివారం కూడా మంచి వసూళ్లు సాధించింది. నాని కెరీర్‌లో దసరా తర్వాత రెండో రూ. 100 కోట్ల సినిమాగా నిలిచింది.
దసరా తర్వాత హాయ్ నాన్న అంటూ క్లాస్ సినిమా చేసారు కానీ.. సరిపోదా శనివారం తర్వాత నాని ఆలోచనలన్నీ మాస్ వైపే వెళ్ళిపోతున్నాయి. ప్రస్తుతం హిట్ 3 పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. సినిమా ఎలా ఉండబోతుందో టీజర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. దీని తర్వాత మరింత వయెలెంట్ సినిమా చేయబోతున్నారు నాని.
శ్రీకాంత్ ఓదెలతో నాని చేయబోయే పారడైజ్ రూత్‌లెస్ మాస్ సినిమా. ఇందులో నాని క్యారెక్టర్ కూడా అలాగే ఉండబోతుంది. దీని తర్వాత సుజీత్ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా ఉండబోతుంది. ఇలా నాని కమిటైన అన్ని సినిమాలు ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్లే. మొత్తానికి రాబోయే రెండేళ్లు నానిలో కేవలం మాస్‌ను మాత్రమే చూడబోతున్నామన్నమాట.