Bigg Boss 7 Telugu: రచ్చ రచ్చగా సాగిన నామినేషన్స్.. మరోసారి గొడవకు దిగిన గౌతమ్, యావర్.. రతికా మామూల్ది కాదు గురూ..!

|

Sep 26, 2023 | 7:29 AM

రతికా మాట్లాడుతూ.. నేను ఎందుకు అప్పుడు ల్యాగ్ చేశానో అప్పటి నుంచి అతను హీరో అయిపోయాడు అని ప్రశాంత్ ను ఉదేశిస్తూ అంది.. దానికి అమర్ కూడా ఒప్పుకుంటూ ప్రశాంత్ పై కామెంట్స్ చేశాడు. ప్రశాంత్ మారడం లేదు అని అమర్ దీప్ కూడా అన్నాడు. అలాగే నామినేషన్స్ లో జాగ్రతగా నామినేట్ చెయ్యి ఎవరు మారారు.. ఎవరు మారలేదు తెలుసుకొని నామినేట్ చేయి అంటూ ఇండైరెక్ట్ గా ప్రశాంత్ ను నామినేట్ చెయ్యమని చెప్పాడు. ఆతర్వాత కిచన్ లో రచ్చ మొదలైంది. రతికా.. శోభా మధ్య కాఫీ గురించి వాగ్వాదం జరిగింది. కాఫీ ఇవ్వను అంటూ రతికాకు తెగేసి చెప్పింది శోభా..

Bigg Boss 7 Telugu: రచ్చ రచ్చగా సాగిన నామినేషన్స్.. మరోసారి గొడవకు దిగిన గౌతమ్, యావర్.. రతికా మామూల్ది కాదు గురూ..!
Bigg Boss 7 Telugu
Follow us on

బిగ్ బాస్ హౌస్ లో ఎప్పటిలానే సోమవారం రోజు కుడా నామినేషన్స్ జరిగాయి. అంతకంటే ముందు హౌస్ మేట్స్ మధ్య డిస్కషన్ జరిగింది. 21వ రోజు రాత్రి ఏడుగంటల ప్రాంతంలో రతికా అమర్ దీప్ డిస్కషన్ పెట్టారు. రతికా మాట్లాడుతూ.. నేను ఎందుకు అప్పుడు ల్యాగ్ చేశానో అప్పటి నుంచి అతను హీరో అయిపోయాడు అని ప్రశాంత్ ను ఉదేశిస్తూ అంది.. దానికి అమర్ కూడా ఒప్పుకుంటూ ప్రశాంత్ పై కామెంట్స్ చేశాడు. ప్రశాంత్ మారడం లేదు అని అమర్ దీప్ కూడా అన్నాడు. అలాగే నామినేషన్స్ లో జాగ్రతగా నామినేట్ చెయ్యి ఎవరు మారారు.. ఎవరు మారలేదు తెలుసుకొని నామినేట్ చేయి అంటూ ఇండైరెక్ట్ గా ప్రశాంత్ ను నామినేట్ చెయ్యమని చెప్పాడు. ఆతర్వాత కిచన్ లో రచ్చ మొదలైంది. రతికా.. శోభా మధ్య కాఫీ గురించి వాగ్వాదం జరిగింది. కాఫీ ఇవ్వను అంటూ రతికాకు తెగేసి చెప్పింది శోభా.. ఆతర్వాత 22 వ రోజు ఉదయాన్నే ప్రశాంత్ ఎదో చేతబడి చేసే వాడిలా కూర్చొని అంతా మారుతుంది అంటూ ఎదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఆ తర్వాత జై లవ కుశ సినిమాలో రావణ సాంగ్ తో అందరు నిద్ర లేచారు. ఒకరినొకరు స్విమింగ్ పూల్ లో తోసుకున్నారు.

ఆ తర్వాత నామినేషన్స్ గురించి అమర్ సుబ్బు  మాట్లాడుకున్నారు నీ మైండ్ లో ఎవరు ఉన్నారు అన్ని అమర్ సుబ్బును అడిగాడు. నా మైండ్ లో ఒకరు ఉన్నారు అని చెప్పింది శుభ శ్రీ (సుబ్బు ) .. ఆ తర్వాత అమర్ నా మైండ్ లో గౌతమ్ ఉన్నాడు అని చెప్పేశాడు. ఆ తర్వాత మూడో పవర్ అస్త్ర గెలుచుకున్న షోనా శెట్టికి పవర్ అస్త్రను అందించారు. ఆతర్వాత యావర్ మాట్లాడుతూ ప్రియాంకా గురించి కామెంట్స్ చేశాడు. నేను ప్రియాంకను నామినేట్ చేస్తా.. అలాగే రతికా నన్ను నామినేట్ చేస్తుంది అని అన్నాడు యావర్. శుభ శ్రీ కూడా రతికా ;గురించి కామెంట్స్ చేసింది. ఫేమ్ కోసం తన ఎక్స్ పేరు వాడుతుంది అని చెప్పింది శుభా శ్రీ. యావర్ కు లీనియస్ ఇచ్చి నేను తప్పు చేశా అని రతికా నేను మాటలలో చనువు ఇచ్చాను అంతే అని అంది. ఆతర్వాత శివాజీ గురినిక్ మాట్లాడుతూ.. అందరిని సేఫ్ గేమ్ ఆడుతున్నారు అంటున్నాడు కానీ ఆయనే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని అంది.

చాలా న్యాక్ గా ఆడుతున్నాడు. అలాగే నాగార్జున గారు వచ్చినప్పుడు మాత్రం గేమ్ మారుస్తున్నాడు అంటూ ఆరోపణలు చేసింది. ఇక ఈసారి నామినేషన్ లో జ్యురీ సభ్యులను కూడా మెప్పించాలి అని తెలిపాడు బిగ్ బాస్. ఒకొక్కరు ఇద్దరినీ నామినేట్ చేయాలి. ఎవరి నామినేషన్స్ రీజన్ తో జ్యురీ మెంబర్స్ కన్విన్స్ అవుతారో.. వారి ఫోటోను గోడపై పెడతారో వారు నామినేట్ అయ్యినట్టు.. ఒక్కరిసారి నామినేట్ అయ్యిన వారిని మరోసారి నామినేట్ చేయడానికి లేదు అని చెప్పాడు బిగ్ బాస్. దాంతో అసలు ట్విస్ట్ మొదలైంది.

ఒక కోర్ట్ సెటప్ లో ఉంచి నామినేషన్స్ ప్రక్రియను మొదలు పెట్టారు. మొత్తం 5 రౌండ్లు ప్రక్రియ ఉంటుందని. ఏ రౌండ్ లో ఎవరు నామినేట్ చేస్తారో కూడా జ్యురీ మెంబర్ ఎంచుకుంటారు. ఎవరి వాదనకు జ్యురీ మెంబర్ ఏకీభవిస్తారో వారు నామినేట్ అయినట్టు అని బిగ్ బాస్ తెలిపాడు. సందీప్, శివాజీ, శోభా శెట్టి. జడ్జ్ లుగా ఉన్నారు. ముందుగా యావర్ ను పిలిచాడు యావర్. ప్రియాంకా, తేజలను ఎంచుకున్నాడు యావర్. ప్రియాంక గురించి మాట్లాడుతూ.. తను మనంను నామినేట్ చేసింది. పక్కవాళ్ళ ప్రాబ్లమ్స్ వినకుండా నిరన్యం తీసుకుంటుంది. నేను శోభా  తో మాట్లాడుతున్నప్పుడు ఆమె మధ్యలో దూరి మాట్లాడింది. అది నాకు నచ్చలేదు అని చెప్పాడు. దానికి ప్రియాంకా వాదించింది. ప్రియాంక శోభా తో మాట్లాడుకుంది కానీ నాకు మాట్లాడే ఛాన్స్ రాలేదు. దాంతో మధ్యలో శోభా కలుగజేసుకొని.. ఈ గొడవంతా అయిపోయిన తర్వాత యావర్ తేజ దగ్గరకు వెళ్లి నేనే త్యాగం చేయాలనుకున్నా అని చెప్పాడు అని శోభా చెప్పింది దాంతో శోభా శెట్టి యావర్ మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో శోభా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పింది. దాంతో ప్రేక్షకులు చూస్తున్నారు అంటూ యావర్ అన్నాడు. ఆతర్వాత ప్రియాంకా అందుకుంది. నాకు అనిపించింది నేను చెప్పను అంతే అని ప్రియాంక. నా కోపం లో నేను బిగ్ బాస్ హౌస్ ప్రాపర్టీ డ్యామేజ్ చేశాను అని అన్నాడు యావర్. అప్పుడు ఇదే బాడీ లాంగ్వేజ్ నాకు నచ్చలేదు అని ప్రియాంకా చెప్పింది. ఇక శివాజీ మాట్లాడుతూ.. నువ్వు ఎందుకు నామినేట్ చేస్తున్నావో చెప్పు అని అడగ్గా ఆమె నన్ను నామినేట్ చేసింది అంటూ అదే సోది చెప్పుకొచ్చాడు. దాంతో శివాజీ అందులో తప్పేముంది ఆమె నిర్ణయం ఆమె చెప్పింది అంటూ న్యాయంగానే మాట్లాడడు.

నా కోపం వల్ల ఎవరు బాధపడలేదు.. కానీ నేను ప్రియాంకా చేపినదానికి బాధపడ్డాను అని తెలిపాడు యావర్. ఆతర్వాత తేజను నామినేట్ చేశాడు యావర్. కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే చేస్తున్నాడు. మిగిలిన గేమ్ ఆడటం లేదు. తేజ పర్ఫామెన్స్ చాలా తక్కువాగా ఉంది అని అన్నాడు. దానికి తేజ మాట్లాడుతూ.. నేను ఇక్కడ ఉన్నది మూడు వారాలే.. ముప్పై వారాలు ఉన్నా నేను నా ఒరిజినాలిటీ  మార్చుకోను అంటూ వాదించాడు.  నేను టాస్క్ లోనూ బాగానే  ఆడుతున్నా.. అని గట్టిగానే చేప్పాడు. ఫిజికల్ గా ఆడటం లేదు అని చెప్పాడు యావర్. కానీ తేజ దానికి ఒప్పుకోలేదు, నేను ఫిజికల్ గానే ఆడాను అని చెప్పాడు. ఇక ఇద్దరివాదన విన్న జ్యురీ మెంబర్స్  ప్రియాంక ఫోటోను గోడపై పెట్టారు. తర్వాత  తేజ యావర్ తో ఫన్ చేశాడు.

ఆతర్వాత శివాజీతో రతికా వాగ్వాదం మొదలుపెట్టింది. కలుపు మొక్క అన్నప్పుడు నువ్వు చెప్పింది నాకు నచ్చలేదు అని అంది రతికా.. నేను సరదాగానే అన్నాను. నేను నిన్ను అనడం లేదు. అని శివాజీ చెప్పినా కూడా రతికా వినలేదు. చివరకు శివాజీ సారీ చెప్పాడు కావాలంటే కళ్ళు కూడా పడుకుంటా.. ఎందుకు సాగదీస్తున్నావ్ అంటూ రతికా పై రివర్స్ అయ్యాడు శివాజీ. ఆతర్వాత సుబ్బూ అమర్ దీప్ ను, రతికాను నామినేట్ చేసింది

రతికా గురించి మాట్లాడుతూ.. ఆమె మాట్లాడుతూ తన ఎక్స్ గూరించి  మాట్లాడుతుంది. అలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పింది రతికా.. అలాగే గేమ్ మీద క్లారిటీ లేదు. ఆతర్వాత ప్రిన్స్ దగ్గర అమర్ గురించి చెప్పింది..ఆతర్వాత మళ్లీ ప్రిన్స్ గురించి మర్చి చెప్పింది అని సుబ్బూ చెప్పింది. దానికి రతికా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. దాంతో సుబ్బూ ఎదో చెప్తుండుగా మధ్యలో ప్రిన్స్ మాట్లాడుతూ.. నేను డిజర్వ్ కాదు ని నువ్వు చెప్పావు అని అన్నా కూడా దానికి రతికా ఒప్పుకోలేదు. అలాగే నేను అమర్ చెప్పింది బ్లైండ్ గా ఫాలో కాలేదు. నాకు అనిపించింది నేను చెప్పను అని వాదించింది. అంతలోనే సందీప్ కలుగజేసుకొని నిన్న నువ్వే చెప్పావు రతికా అని అన్నాడు. ఆతర్వాత గౌతమ్ అందుకొని రతికా గురించి చెప్పాడు. కానీ రతికా అడ్డదిడ్డంగా వాదించింది. ఆ తర్వాత అమర్ గురించి మాట్లాడుతూ.. నేను ఆయన నుంచి చాలా ఆశిస్తున్నా అని తెలిపింది. అలాగే హెయిర్ కట్ విషయంలో ఆయన నో చెప్పడం నచ్చలేదు. ఆయన గేమ్ మర్చిపోయి అందరిని ప్రెండ్స్ అనుకోని వీక్ అవుతున్నారు అని చెప్పింది సుబ్బూ.. దానికి అమర్ మాట్లాడుతూ నేను మైల్డ్ గా ఉన్నాను వైల్డ్ గా మారతాను అన్నది ఒక ప్రాసకోసమే అన్నాడు. ఎవరి పర్సనల్ ప్రాబ్లెమ్ వల్లే జుట్టు ఇవ్వలేదు. నా పర్సనల్ ప్రాబ్లమ్ గురించి నేను అందరికి చెప్పను కూడా అన్నాడు. ఆతర్వాత అమర్ కు సుబ్బు మధ్య వాదన జరిగింది. ఇంట్లో ఏం పని చేయలేదు.

ఆతర్వాత సుబ్బు కు రతికాకు మధ్య గట్టిగానే రచ్చ జరిగింది. జడ్జ్ లు చెప్తున్నా కూడా ఆమె ఆగలేదు. ఫైనల్ గా రతికా ఫోటోను గోడమీద పెట్టారు. ఆతర్వాత గౌతమ్  యావర్ ను, తేజను  నామినేట్ చేశాడు. యావర్ నన్ను తూ క్యారే అని నన్ను అన్నాడు నేను దానికి హార్ట్ అయ్యాను. నేను డాక్టర్ ను నేను డైరెక్ట్ కూడా చేశా అని అన్నాడు. ఆతర్వాత టవర్ మాట్లడుతూ.. నువ్వు డాక్టర్ వి అప్పుడు అన్నవి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావ్ అని యావర్ అన్నాడు. ఆతర్వాత గౌతమ్, ప్రిన్స్ మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. దాంతో మరోసారి యావర్ తన యాంగ్రీ చూపించాడు. గౌతమ్ మీదకు వెళ్ళాడు. దాంతో జ్యురీ మెంబర్స్ శివాజీ , సందీప్ యావర్ ను నీ ప్లేస్ లో నిలుచొని మాట్లాడు అని అంటున్న కూడా.. యావర్ వినిపించుకోలేదు. సందీప్ తో  గొడవకు దిగాడు. దాంతో శివాజీ , సందీప్ కూడా యావర్ పై సీరియస్ అవుతున్నాడు. దాంతో గౌతమ్ యావర్ యాటిట్యూడ్ నాకు నచ్చలేదు అంటూ చెప్పాడు గౌతమ్. ఆతర్వాత తేజ గురించి మాట్లాడుతూ.. జెస్ట్ ఫిజికల్ టాస్క్ లో ఇంకొంచం ఆడటం లేదు అని అన్నాడు. దానికి తేజ క్లారిటీ ఇచ్చాడు. తేజ మధ్యలో కామెడీ చేసే ప్రయత్నం చేశాడు. దాంతో జ్యురీ మెంబర్స్ సీరియస్ అయ్యారు. ఫైనల్ గా గౌతమ్ చెప్పిన రీజన్స్ లో రెండు సిల్లీ గా అనిపించాయి. నువ్వు చెప్పిన వాటిని బట్టి మేము నామినేట్ చేయడం లేదు. కానీ అతడి బిహేవియర్ గురించి మేము నామినేట్ చేస్తున్నాం అని అన్నారు దాంతో అతడి ఫోటో గోడమీదకు వెళ్ళింది. కానీ చివరిలో బిగ్ బాస్ నామినేషన్ అనేది రీజన్స్ ను బట్టి ఉండాలి కానీ ప్రవర్తనను బట్టి కాదు అని చెప్పడంతో యావర్ ఫోటోను గోడపై నుంచి తొలగించారు. దాంతో మనోడు ఎదో యుద్ధం గెలిచినట్టు ఫీలైపోయాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.