
Skylab: నిత్యామీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుస్తున్న సినిమా ‘స్కై లాబ్’. తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చాలా కొత్తగా ఉంది. బండ లింగపల్లిలో గౌరి(నిత్యా మీనన్) ఓ ధనివంతురాలి బిడ్డ. కానీ జర్నలిస్ట్ కావాలనే కోరికతో ప్రతిబింబం పత్రికకు వార్తలు సేకరించి రాస్తుంటుంది. డాక్టర్ ఆనంద్(సత్యదేవ్) తన గ్రామంలో హాస్పిటల్ పెట్టాలనుకుంటాడు. అయితే తనకు కాస్త స్వార్థం. తన పని పూర్తయితే చాలు అనుకునే రకం ఆనంద్, ఎప్పుడూ డబ్బు గురించే ఆలోచిస్తుంటాడు. వీరితో పాటు సుబేదార్ రామారావు జత కలుస్తాడు. వీరి జీవితాల్లో ఏదో రకంగా సాగుతుంటాయి. ఒక్కొక్కరికీ ఒక్కో సమస్య. మరి వారి సమస్యలు తీరాలంటే ఏదైనా అద్భుతం జరగాలని అనుకుంటారు. అదే సమయంలో అంతరిక్ష్యంలో ప్రవేశ పెట్టిన ఉపగ్రహం స్కైలాబ్‌లో సాంకేతిక కారణాలో పెను ప్రమాదం వాటిల్లబోతుందని రేడియోలో వార్త వస్తుంది. అది నేరుగా బండ లింగపల్లిలోనే పడుతుందని అందరూ భావిస్తారు. అప్పుడు అందరి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి. అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ‘స్కై లాబ్’ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్ శనివారం విడుదలైంది.
ఈ ట్రైలర్ గురించి మెగా హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘‘నేను స్కైలాబ్ ట్రైలర్ చూశాను. చాలా బాగా నచ్చింది. నా స్నేహితుడు సత్యకు అభినందనలు. నిత్యామీనన్‌గారికి, రాహుల్ రామకృష్ణకి కంగ్రాట్స్. డిసెంబర్ 4న సినిమా విడుదలవుతుంది. సినిమా పెద్ద సక్సెస్ చేస్తారని భావిస్తున్నాను’’అని అన్నారు.
రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫ్యూచర్స్, నిత్యామీనన్ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తోన్న చిత్రం ‘స్కైలాబ్’. 1979 లో సాగే పీరియాడిక్ మూవీ ఇది. ఈ సినిమాను డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :