Check Movie : ఆడిపాడుతున్న నితిన్- ప్రియవారియర్.. ‘చెక్’ మూవీ సాంగ్ కోసం గోవా చెక్కేసిన జంట..

నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన థ్రిల్లర్ మూవీ ‘చెక్’. వైవిధ్యమైన సినిమాలను రూపొందించే క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం..

Check Movie : ఆడిపాడుతున్న నితిన్- ప్రియవారియర్.. 'చెక్' మూవీ సాంగ్ కోసం గోవా చెక్కేసిన జంట..
ఈ సినిమాకు క్లైమాక్స్ ప్రధాన హైలైట్ అని.. నితిన్ నటన అద్భుతంగా ఉందని ప్రశంసలు అందించారు. లాయర్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటన బాగుందని అన్నారు. అలాగే ప్రియా ప్రకాష్ వారియర్ కూడా సినిమాలో ముఖ్య భూమిక పోషించిందని చెబుతున్నారు.
Follow us

|

Updated on: Feb 13, 2021 | 3:30 AM

Check Movie : నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన థ్రిల్లర్ మూవీ ‘చెక్’. వైవిధ్యమైన సినిమాలను రూపొందించే క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 26న థియేటర్లలో విడుదలవుతోంది. ఇప్పటికే విడులైన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది.

ఇటీవల గోవాలో నితిన్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌పై పాటను చిత్రీకరించారు. ‘నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా’ అనే పల్లవితో సాగే ఈ గీతానికి శ్రీమణి సాహిత్యాన్ని అందించారు.ఈ సినిమాకు కల్యాణి మాలిక్‌ సంగీతాన్నందించారు. సాయిచంద్‌, సంపత్‌రాజ్‌, పోసాని కృష్ణమురళి, హర్షవర్ధన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘దేశద్రోహిగా ముద్రపడిన ఓ చెస్‌ ప్లేయర్‌ కథ ఇది. యాక్షన్‌, లవ్‌, సస్పెన్స్‌ అంశాలతో థ్రిల్‌ను పంచుతుందని అన్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం ఆ అంచనాలను దాటేసింది. ‘చెక్’ సినిమా థియేట్రికల్ హక్కులు మంచి ధరలకు అమ్ముడుపోయాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Prabhas starrer movie : ‘సలార్’ సినిమానుంచి లీకైన ఫోటో.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పిక్..