టాలీవుడ్ హీరో నితిన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో నితిన్ తన కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నితిన్ వెంట భార్య షాలిని, కొడుకు ఉన్నారు. దర్శనం అనంతరం నితిన్ కుటుంబ సభ్యులకు రంగనాయక మండపంలో వేదపండితులు వేదాశ్వీరచనం అందించారు. టీటీడీ సిబ్బంది పట్టువస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం శ్రీవారి ఆలయం ఎదుటకు వచ్చిన నితిన్‌తో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు. కాగా గతేడాది నితిన్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. సెప్టెంబర్ లో తనకు కుమారుడు జన్మించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. చాలా మంది సెలబ్రిటీల్లాగే నితిన్ కూడా తన తనయుడికి సంబంధించిన ఎలాంటి ఫొటోలు ఇప్పటివరకు బయటకు రానీయలేదు. దీంతో జూనియర్ నితిన్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా? అని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇక తిరుమలలోనూ తమ కుమారుడి ముఖం కనిపించకుండా జాగ్రత్త పడారు నితిన్- షాలినీ. అయితే కొందరు మాత్రం నితిన్ కొడుకు ముఖాన్ని తమ సెల్ ఫోన్ల కెమెరాలలో బంధించారు. ఇవి ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు జూనియర్ నితిన్ క్యూట్ గా ఉన్నాడంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
కాగా.. ప్రస్తుతం హీరో నితిన్ రాబిన్‌హుడ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. గతేడాది క్రిస్టమస్ విడుదల కావాల్సిన ‘రాబిన్ హుడ్’ వాయిదా పడింది. పుష్ప-2 ప్రభంజనం నేపథ్యంలో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత సంక్రాంతికి కూడా ఈ సినిమా రిలీజ్ కాలేదు. దీంతో ఫిబ్రవరిలో నితిన్ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. రాబిన్ హుడ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. భీష్మ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ కుడుముల- నితిన్ కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో రాబిన్ హుడ్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడుఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడంతో సినిమాపై హైప్ బాగా పెరిగిపోయింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. రాబిన్ హుడ్ తో పాటు తమ్ముడు అనే సినిమాలోనూ హీరోగా నటిస్తున్నాడు నితిన్.
Youth Star @actor_nithiin visited Tirumala to seek the divine blessings of Lord Venkateshwara!🙏#Nithiin #Robinhood #TeluguFilmNagar pic.twitter.com/tCR1B93mPH
— Telugu FilmNagar (@telugufilmnagar) January 25, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి