Sridevi Shoban Babu : ‘శ్రీదేవి శోభన్ బాబు’ మూవీ నుంచి అందమైన మెలోడి సాంగ్..

కుర్ర హీరో సంతోష్ శోభన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుతున్నాడు. సినిమాలు, వెబ్ సిరీస్ లతో దూసుకుపోతున్నాడు. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.

Sridevi Shoban Babu : ‘శ్రీదేవి శోభన్ బాబు’ మూవీ నుంచి అందమైన మెలోడి సాంగ్..
Sridevi Shoban Babu

Updated on: Apr 16, 2022 | 4:52 PM

Sridevi Shoban Babu: కుర్ర హీరో సంతోష్ శోభన్(, Santosh Shoban) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుతున్నాడు. సినిమాలు, వెబ్ సిరీస్ లతో దూసుకుపోతున్నాడు. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. సంతోష్ శోభన్ , గౌరి జి కిషన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న సినిమా ‘శ్రీదేవి శోభన్ బాబు’. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్ర‌శాంత్ కుమార్ దిమ్మ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల‌, విష్ణు ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్ లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అందమైన ప్రేమ కథగా తెరకెక్కుతోన్న ఈ సినిమానుంచి తాజాగా మధురమైన పాటను రిలీజ్ చేశారు.

‘నిను చూశాక.. అంటూ సాగే మెలోడీ సాంగ్ ఇది ఈ పాటను మెగా హీరో సాయిధరమ్ తేజ్ విడుదల చేసి చిత్రయూనిట్ కు విషెస్ తెలిపారు. సంతోష్ శోభన్, గౌరి జి కిషన్ (జాను ఫేమ్) లపై పాటను చిత్రీకరించారు. కమ్రాన్ సంగీత సారథ్యం వహించిన సినిమాలో ఈ పాటకు అద్భుతమైన ట్యూన్‌ని కంపోజ్ చేశారు. రాకేందు మౌళి రాసిన ఈ పాట‌ను జునైద్ కుమార్ ఆల‌పించారు. ప్ర‌శాంత్ కుమార్ దిమ్మల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘శ్రీదేవి శోభన్ బాబు’ చిత్రం రెండు వేర్వేరు మ‌న‌స్త‌త్వాలున్న అమ్మాయి, అబ్బాయి మ‌ధ్య సాగే సంఘ‌ర్ష‌ణ‌, ప్రేమ వంటి ఎలిమెంట్స్‌ను తెలియ‌జేస్తుంది. శ‌ర‌ణ్య పొట్ల ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సిద్ధార్థ్ రామ‌స్వామి సినిమాటోగ్ర‌ఫీ అందించిన ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల ఈ సినిమాకు కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌గానూ వ‌ర్క్ చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Happy Birthday JD Chakravarthy: పలు భాషల్లో విలక్షణ నటుడి హవా.. వరుస సినిమాలతో జేడీ చక్రవర్తి ఫుల్ బిజీ..

Avantika Mishra: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ‘వైశాఖం’ బ్యూటీ.. వైరల్ అవుతున్న ఫోటోలు

Jayamma Panchayathi: జయమ్మ పంచాయతీ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన సుమక్క..