అందాల “నిధి”.. పెంకి పిల్లేన‌ట‌

నటిగా తనను వెండితెరపై చూసినప్పుడు త‌ల్లిదండ్రులు​ గర్వపడ్డారని అంటోంది అందాల భామ‌ నిధి అగర్వాల్​. చిన్నతనంలో తాను చాలా పెంకి పిల్ల‌న‌ని, చాలా అల్ల‌రి ప‌నులు చేశాన‌ని చెబుతోంది.

అందాల నిధి.. పెంకి పిల్లేన‌ట‌

Edited By:

Updated on: Jun 29, 2020 | 6:56 PM

నటిగా తనను వెండితెరపై చూసినప్పుడు త‌ల్లిదండ్రులు​ గర్వపడ్డారని అంటోంది అందాల భామ‌ నిధి అగర్వాల్​. చిన్నతనంలో తాను చాలా పెంకి పిల్ల‌న‌ని, చాలా అల్ల‌రి ప‌నులు చేశాన‌ని చెబుతోంది. పాఠ‌శాల మార్కులకు సంబంధించిన‌‌​‌​ ప్రోగ్రస్​ కార్డులో తల్లి సంతకాన్ని తానే పెట్టిన‌ట్టు తాజాగా వెల్లడించిందీ నటి.

త‌ల్లి సంతకాన్ని కాపీ కొట్టడం ఎప్ప‌టికీ త‌న‌కి గుర్తుండిపోతుంద‌ని పేర్కొంది. చిన్నప్పుడు ప‌రీక్ష‌ల్లో మార్క్స్ త‌క్కువ‌గా వ‌స్తే .. ప్రోగ్రస్‌ కార్డ్ తీసుకుని త‌న తండ్రి ద‌గ్గ‌రికి వెళ్ల‌డానికి భ‌య‌మేసేద‌ని పేర్కొంది. పోనీ అమ్మకు చూపించినా తిట్లు తప్పవు కాబ‌ట్టి ఆమె సైన్ తానే పెట్టేసుకునేదాన్న‌‌ని వెల్ల‌డించింది. త‌న తండ్రి సంతకం కాపీ చేయ‌డం చాలా క‌ష్ట‌మ‌ని.. త‌న మ‌ద‌ర్ ది అయినే ఈజీ అని వివ‌రించింది. కొన్నాళ్లకు తన త‌ల్లికి ఆ విషయం తెలిసి గట్టిగా మందలించింది తెలిపింది.