Pooja Hegde: పూజా హెగ్డే పెళ్లి పీటలెక్కనుందా..? అందుకే కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదా..?
కేరీర్ బిగినింగ్ లో అమ్మడు పట్టిందల్లా బంగారం అయ్యింది.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ బ్యాడ్ లాక్.. వద్దన్నా వెంటపడుతున్న డిజాస్టర్స్ తో సతమతం అవుతుంది పూజా. ఈ అమ్మడు నిన్నటివరకు తెలుగు, హిందీ, తమిళ్ సినిమాల్లో చాలా బిజీ నటి. ఆమెకు భారీ డిమాండ్ కూడా ఉండేది. ఇప్పటివరకు వరుస సినిమాలతో దూసుకుపోయిన ఈ చిన్నది ఇప్పుడు ఒక్క సినిమాను కూడా ఓకే చేయడం లేదు. అంతే కాదు వచ్చిన సినిమాలనుంచి తప్పుకొని అభిమానులకు గట్టి షాక్ కూడా ఇచ్చింది.

పూజా హెగ్డే సినిమాలనుంచి బ్రేక్ తీసుకుందా..? త్వరలోనే ఆమె చేసుకోబోతుందా..? ఇప్పుడు ఇవే అనుమానాలు తలెత్తుతున్నాయి ఫ్యాన్స్ లో. కేరీర్ బిగినింగ్ లో అమ్మడు పట్టిందల్లా బంగారం అయ్యింది.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ బ్యాడ్ లాక్.. వద్దన్నా వెంటపడుతున్న డిజాస్టర్స్ తో సతమతం అవుతుంది పూజా. ఈ అమ్మడు నిన్నటివరకు తెలుగు, హిందీ, తమిళ్ సినిమాల్లో చాలా బిజీ నటి. ఆమెకు భారీ డిమాండ్ కూడా ఉండేది. ఇప్పటివరకు వరుస సినిమాలతో దూసుకుపోయిన ఈ చిన్నది ఇప్పుడు ఒక్క సినిమాను కూడా ఓకే చేయడం లేదు. అంతే కాదు వచ్చిన సినిమాలనుంచి తప్పుకొని అభిమానులకు గట్టి షాక్ కూడా ఇచ్చింది. అసలు పూజ ఎందుకు ఇలా చేస్తుంది. ఆమె సినిమాలకు బ్రేక్ ఇవాలనుకుంటుందా..? లేడీ పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉందా అంటూ గుసగుసలాడుకుంటున్నారు పూజా పాప ఫ్యాన్స్.
పూజా హెగ్డే 2012లో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. జీవ హీరోగా నటించిన మాస్క్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది పూజా. ఆ తర్వాత తెలుగులో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యతో కలిసి ‘ఒక లైలా కోసం’ సినిమాలో నటించింది. అలాగే 2016లో ‘మొహెంజో దారో’ సినిమాలోనటించింది ఈ సినిమాలో కండల వీరుడు హృతిక్ రోషన్ హీరోగా నటించాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. అయినాకూడా పూజా అందానికి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక 2017లో ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’ సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో బికినీలో రెచ్చిపోయింది. అందాలు ఆరబోసి అడగగొట్టింది.
2018లో ‘అరవింద సమేద వీర రాఘవ’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ తర్వాత మహేష్ బాబుతో ‘మహర్షి’, అక్షయ్ కుమార్ తో ‘హౌస్ ఫుల్ 4’, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. దాంతో స్టార్ హీరోయిన్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాతే అసలు కథ మొదలైంది.
‘రాధే శ్యామ్’, ‘బీస్ట్’, ‘సర్కస్’, ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తాపడ్డాయి. వరుస సినిమాలు పరాజయం పాలవడంతో పూజా హెగ్డే డైలమాలో పడింది. అయితే అదే సమయంలో రెండు క్రేజీ ఆఫర్స్ తలుపు తట్టాయి. కానీ చేతుల్లారా పూజానే ఆ సినిమాలనుంచి వదులుకుంది. ఆ సినిమాలే సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం అలాగే పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.
గుంటూరు కారం సినిమా పూజా కార్యక్రమంలోనూ పాల్గొన్న పూజా కొన్ని సన్నివేశాల్లోనూ నటించిందట. కానీ అనుకోకుండా ఈ సినిమానుంచి తప్పుకుంది. దాంతో ఆమె ప్లేస్ లోకి యంగ్ బ్యూటీ శ్రీలీలను ఎంపిక చేశారు త్రివిక్రమ్. అలాగే పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుంచి కూడా ఇలానే తప్పుకుంది. దాంతో ఆమె ఫ్యాన్స్ అవాక్ అయ్యారు. అసలే ఫ్లాప్ లు పగపడుతున్న సమయంలో మంచి ఆఫర్స్ ఎందుకు మిస్ చేసుకుందా..? అని ఆలోచనలో పడ్డారు. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ తర్వాత పూజా హెగ్డే కొత్త సినిమా ఏదీ ప్రకటించలేదు. మరి ఎందుకు ఈ అమ్మడు మౌనంగా ఉంటుంది అన్నది తెలియాల్సి ఉంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
