Krack Movie: మరో పాటను విడుదల చేసిన ‘క్రాక్‌’ సినిమా యూనిట్‌… క్లాస్‌ కళ్యాణీ మాస్‌ స్టెప్పులు చూశారా..?

లాక్‌ డౌన్‌ తర్వాత ఎన్నో భయాల నడుమ విడుదల 'క్రాక్‌' చిత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. తనకు ఎంతగానో అచ్చొచ్చిన పోలీస్‌ పాత్రలో నటించిన రవితేజ వరుస ఫ్లాఫ్‌ల తర్వాత మరో..

Krack Movie: మరో పాటను విడుదల చేసిన క్రాక్‌ సినిమా యూనిట్‌... క్లాస్‌ కళ్యాణీ మాస్‌ స్టెప్పులు చూశారా..?

Updated on: Feb 03, 2021 | 5:48 AM

Mass biryani Full song Released: కరోనా కారణంగా థియేటర్లు మూతపడడంతో మూగబోయిన ఇండస్ట్రీ మళ్లీ కేంద్ర ప్రభుత్వం సడలింపుల తర్వాత తెరుచుకున్నాయి. సంక్రాంతి కానుకగా థియేటర్లు రీఓపెన్‌ అయిన విషయం తెలిసిందే. ఇక థియేటర్లు విడుదల అవుతూనే ‘క్రాక్‌’ సినిమాతో రవితేజ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
లాక్‌ డౌన్‌ తర్వాత ఎన్నో భయాల నడుమ విడుదల ‘క్రాక్‌’ చిత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. తనకు ఎంతగానో అచ్చొచ్చిన పోలీస్‌ పాత్రలో నటించిన రవితేజ వరుస ఫ్లాఫ్‌ల తర్వాత మరో సక్సెస్‌ను అందుకున్నాడు. ఇక చాలా ఏళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న శృతీ హాసన్‌కు కూడా ఈ సినిమా మంచి కమ్‌ బ్యాక్‌ మూవీ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో ‘క్లాస్‌ కళ్యాణీ.. పెట్టవే మాస్‌ బిర్యాణీ’ పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. ఈ పాటలో రవితేజ, శృతీ హాసన్‌ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇక మాస్‌ పాటకు ఈ జంట వేసిన మాస్‌ స్టెప్పులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ‘క్రాక్‌’ సినిమా ఫిబ్రవరి 5న ‘ఆహా’ ఓటీటీలో విడుదల కానుంది.

Also Read: బాలయ్య కోసం బోయపాటి భారీ ప్లాన్.. బీబీ3లోకి రియల్ హీరోను దించే పనిలో డైరెక్టర్ ?