Telugu News Entertainment Tollywood New OTT Releases This Week: Upcoming Movies, Web Series, Shows Releasing on Netflix Prime Hotstar Aha ZEE5 Telugu Film News
OTT Movies: ఈ వారం ఫిల్మ్ లవర్స్‌కు ఫుల్ మీల్స్.. వివిధ ఓటీటీలలో రిలీజ్ అవ్వనున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే
ఈ వారం ఓటీటీ వేదికగా మూవీ ప్రేమికులను అలరించేందుకు సిద్ధమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు మీ కోసం.
ఈ సంక్రాంతికి థియేటర్లకు వచ్చిన సీనియర్ హీరోలు.. ఆడియెన్స్‌కు ఫుల్ మీల్స్ అందించారు. బాలయ్య వీరసింహారెడ్డి సినిమాతో మాస్ ప్రేక్షుకులను అలరించగా.. వాల్తేరు వీరయ్యగా వచ్చిన చిరు తన వింటేజ్ లుక్‌తో అలరించారు. ప్రజంట్ ఈ సినిమాలు థియేటర్లలో దుమ్మురేపుతున్నాయి. ‘తెగింపు’, ‘వారసుడు’, ‘కల్యాణం కమనీయం’ సినిమాలు కూడా రిలీజై పలు వర్గాల ఆడియెన్స్‌ను అలరిస్తున్నాయి. దగ్గర్లో అయితే పెద్ద సినిమాల రిలీజ్‌లు ఏవీ లేవు. అయితే పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీలలో సందడి చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న కంటెంట్ ఏంటో తెలుసుకుందాం పదండి.
మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథరావు నక్కిన ధమాకా జనవరి 22 నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది
ఝాన్సీ సీజన్- 2 తెలుగు వెబ్ సిరీస్ జనవరి 19 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవ్వనుంది
అమెజాన్ ప్రైమ్‌లో
ది లెజెండ్ ఆఫ్ వోక్స్ మెకీనా: జనవరి 20 నుంచి స్ట్రీమింగ్
సినిమా మార్తే డమ్ టక్: జనవరి 20 నుంచి స్ట్రీమింగ్
డిస్నీ+ హాట్‌స్టార్
లాస్ట్ మ్యాన్ ఫౌండ్ సీజన్-1: జనవరి 20 నుంచి స్ట్రీమింగ్
అబాట్ ఎలిమెంటరీ సీజన్- 2, ఎపిసోడ్ 13: జనవరి 19 నుంచి స్ట్రీమింగ్
ది ఎల్ వరల్డ్: జెనరేషన్ క్యూ సీజన్- 3, ఎపిసోడ్ 10: జనవరి 20 నుంచి స్ట్రీమింగ్
బిగ్ స్కై సీజన్- 3, ఎపిసోడ్ 13 (సిరీస్): జనవరి 19 నుంచి స్ట్రీమింగ్
ఆహా
డ్రైవర్ జమున తెలుగు, తమిళం భాషల్లో జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది
యూత్ ఆఫ్ మే (కొరియన్ సిరీస్ తెలుగులో) జనవరి 21 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఆహా తెలిపింది
జీ 5
తేజస్ డీయోస్కర్ దర్శకత్వం రకుల్‌ప్రీత్‌సింగ్ నటించిన చిత్రం ‘ఛత్రీవాలి’ ఒకటి. ఇది జనవరి 20న డైరెక్ట్‌గా ‘జీ 5’లో రిలీజ్ అవ్వనుంది