Cinema News: అరెరె.. చాలా గ్యాప్ తర్వాత మరో సినిమా.. గుర్తుపట్టారా ఈ లెజెండ్‌ని..?

|

Jun 24, 2024 | 5:00 PM

ఈయన్ని గుర్తుపట్టరా..? తొలి సినిమాలోనే హీరోయిన్‌గా ఊర్వశి రౌతేలాను తీసుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని.. పట్టు వదలని విక్రమార్కుడిలా మరోసారి ఆడియన్స్‌ను పలకరించబోతున్నారు. ఆ డీటేల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి...

Cinema News: అరెరె.. చాలా గ్యాప్ తర్వాత మరో సినిమా.. గుర్తుపట్టారా ఈ లెజెండ్‌ని..?
Legend Saravanan
Follow us on

గెట్ రెడీ బాయ్స్. లెజెండ్ మళ్లీ వచ్చేస్తున్నాడు. ఆయన కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. ఈ సారి తన లుక్ కూడా మళ్లీ మార్చేశాడు. ఇంతకీ పైన ఫోటోల్లో ఉంది ఎవరో గుర్తుపట్టారా..? లెజెండ్ శరవణన్. గతంలో తన స్టోర్ యాడ్స్ కోసం టాప్ హీరోయిన్స్‌ పక్కన మెరిసిన ఆయన..  2022లో హీరోగా  ‘ది లెజెండ్’ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే సినిమా స్టోరీ పర్లేదు అనిపించినా.. యాక్టింగ్ విషయంలో  శరవణన్  ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని చాలామంది కామెంట్స్ చేశారు. ఆయనపై చాలా మీమ్స్‌ కూడా అప్పట్లో నెట్టింట ట్రెండ్ అయ్యాయి. అందుకేనేమో రెండేళ్ల గ్యాప్ తీసుకున్న ఆయన..  తాజాగా ఆయన తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు.  ‘గరుడన్‌’ సినిమాతో తన మార్క్ చూపిన డైరెక్టర్ దురై సెంథిల్‌ కుమార్‌ దర్శకత్వంలో తాజాగా సినిమా చేస్తున్నాడు శరవణన్. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా స్టార్టయింది. అయితే ఈ ఫోటోలను బట్టి చూస్తే ఆయన లుక్ ఛేంజ్ అయినట్లు కనిపిస్తోంది. చాలా క్లాసీ లుక్‌లో ఆయన కనిపిస్తున్నాడు. లుక్‌తో పాటు.. యాక్టింగ్‌లో మెలుకువలు కూడా నేర్చుకుని ఉంటే చాలా బెటర్ అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ఇతర సాంకేతక నిపుణుల వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

శరవణన్ అరుల్… ‘ది లెజెండ్ న్యూ శరవణ స్టోర్స్’ కి ఓనర్ అన్న విషయం తెలిసిందే. తన ప్రొడక్ట్స్‌కు తమన్నా, హన్సిక లాంటి హీరోయిన్స్‌తో కలిసి బ్రాండింగ్ చేసి అప్పట్లో తెగ పాపులర్ అయ్యారు. సినిమాలు అంటే ఆయనకు చాలా ఇష్టం. నటుడిగా రాణించాలన్నది ఆయన కోరిక. అందుకే..  50 ఏళ్ల వయసులో హీరోగా మారి..  ‘ది లెజెండ్’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. చాలా గ్రాండ్‌గా తీసినప్పటికీ.. అనుకున్నంత ఇదిగా సినిమా ఆడలేదు. ముఖ్యంగా శరవణన్ యాక్టింగ్‌పై తెగ ట్రోల్స్ వచ్చాయి. అయినా సరే విమర్శలను పట్టించుకోకుండా.. మరో ప్రయత్నం చేస్తున్నారు ఆయన. మరి ఈ సారి అయినా మెప్పిస్తారో లేదో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.