కేవలం 6 అంటే 6 రోజులు మాత్రమే బిగ్ బాస్ ఇంట్లో ఉంది ఆ అమ్మాయి. 7వ రోజు బయటకు వచ్చేసింది. కానీ ఆమె క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే నెవర్ బిఫోర్. అది కూడా నెగిటివ్ ఇంపాక్ట్ కాదు. పాజిటివ్ ఇంపాక్ట్. ఈ సీజన్‌లో తొలిసారి అన్ ఫెయిర్ ఎలిమినేషన్ జరిగిందా అన్న అనుమానం కలిగింది. ఇంట్లో ఉన్నన్ని రోజులు.. నయని పావని అందరితో జోవియల్‌గా ఉంది. ఎవరితోనూ గొడవపడేలేదు. నామినేషన్స్ సమయంలోనే తేజాతో కాస్త వార్డ్స్ ఎక్స్చేంజ్ జరిగింది. అది కూడా నార్మల్‌గానే. ఇంట్లో అన్ని ఆటల్లో చాలా యాక్టివ్‌గా పాల్గొంది నయని. అందం, అణుకువ ఉన్న పిల్ల. అలాంటి అమ్మాయికి ఓట్లు పడకపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు బిగ్ బాస్ ఇంట్లో ఎందుకున్నారో అర్థం కాని.. పూజా మూర్తి, అశ్విని సేఫ్ అయ్యి.. నయని ఎలిమినేటెడ్ అనే సరికి వీక్షకులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ పరిణామాన్ని కనీసం ఊహించని నయని.. వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె గుండె చెరువయ్యింది. మిగిలిన హౌస్ మేట్స్ కూడా నయని కన్నీళ్లు పెట్టడం చూసి కదిలిపోయారు. శివాజీ నయనిని సముదాయించి బయటకు పంపారు.
నయనికి ఇన్‌స్టాలో 7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంతేకాదు.. ఆమె ఫ్రెండ్స్‌లో కూడా చాలామంది సోషల్ మీడియా ఇన్‌ప్లూయన్సర్స్ ఉన్నారు. వారు ఓట్లు వేసి ఉంటే.. ఆమె పక్కాగా సేవ్ అయ్యేది. కాకపోతే.. నయని ఎందుకు ఎలిమినేట్ అవుతుందిలే అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ చాలామందికి ఉంది. ఆ కారణంతోనే ఓట్లు వేయలేదు. దీంతో ఊహించని విధంగా డ్యామేజ్ జరిగింది. అసలు 6 రోజుల్లో ఆమె మిగిలిన హౌస్ మేట్స్‌తో ఏర్పరుచుకున్న బాండింగ్ మాత్రం సో ఎమోషనల్. తేజ, శోభా, పల్లవి ప్రశాంత్, శివాజీ లాంటి వాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారంటే.. తను వారికి ఎంత ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇంత పాజిటివ్ ఇంపాక్ట్‌తో బయటకు వెళ్లిన నయని రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు. అందుకు బదులుగా ఆమెను బిగ్ బాస్ ఓటీటీ సీజన్‌కు తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ సీజన్ ఎలిమినేషన్ అయ్యే వెళ్లేముందు.. చాలామంది హౌస్ మేట్స్, ఆడియెన్స్ కళ్లలో నీళ్లు తెచ్చేలా ఇంపాక్ట్ ఇచ్చిన ప్లేయర్ అయితే నయని పావని. అందులో నో డౌట్. ఆల్ ది ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ నయని.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.