Keerthy Suresh: ఎంతపని చేశావ్ అమ్మడూ..! దళపతికి లేనిపోని తలనొప్పి తెచ్చిన కీర్తిసురేష్

|

Aug 06, 2024 | 8:18 AM

తాజాగా కీర్తిసురేష్ చేసినకామెంట్స్ పుణ్యమా అని నెటిజన్స్ దళపతి విజయ్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ నటుడు దళపతి విజయ్ పై ట్రోల్ జరుగుతోంది. డ్యాన్స్ సరిగా రాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. దళపతి విజయ్ ఇలా ట్రోల్ కావడానికి కారణం నటి కీర్తి సురేష్.

Keerthy Suresh: ఎంతపని చేశావ్ అమ్మడూ..! దళపతికి లేనిపోని తలనొప్పి తెచ్చిన కీర్తిసురేష్
Keerthy Suresh
Follow us on

కీర్తిసురేష్‌కు తెలుగులో మంచి క్రేజ్ ఉన్నవిషయం తెలిసిందే.. తెలుగులో మహానటి సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయిన ఈ అమ్మడు.. వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా కీర్తిసురేష్ చేసినకామెంట్స్ పుణ్యమా అని నెటిజన్స్ దళపతి విజయ్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ నటుడు దళపతి విజయ్ పై ట్రోల్ జరుగుతోంది. డ్యాన్స్ సరిగా రాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. దళపతి విజయ్ ఇలా ట్రోల్ కావడానికి కారణం నటి కీర్తి సురేష్. కీర్తిసురేష్ చేసిన ఒక్క అనౌన్స్ మెంట్ కారణంగా, దళపతి విజయ్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాడు. ఇదంతా ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి కంటే దళపతి విజయ్ బెస్ట్ డ్యాన్సర్ అని కీర్తి సురేష్ కామెంట్ చేసింది.

తాజాగా నటి కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. దళపతి విజయ్, మెగా స్టార్ చిరంజీవిలలో ఎవరు బెస్ట్ డ్యాన్సర్ అని అడిగినప్పుడు కీర్తి సురేష్ దళపతి విజయ్ పేరును చెప్పింది. దీంతో చిరంజీవి అభిమానులు ఖంగుతిన్నారు. కీర్తి అభిప్రాయం తప్పు అని చిరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దళపతి విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాలో నటించాడు.

రీసెంట్‌గా ఈ చిత్రం నుంచి కొత్త పాటను విడుదల చేశారు. విజయ్ డ్యాన్స్ సరిగా లేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. విజయ్ వేసిన స్టెప్పులు చాలా కామెడీగా, వెరైటీగా ఉన్నాయని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. దళపతి విజయ్ అభిమానులు ఈ కొత్త పాటను తెగషేర్ చేస్తున్నారు. అయితే కొంతమంది నెటిజన్స్ మాత్రం ట్రోల్ చేస్తూనే ఉన్నారు. కీర్తిసురేష్ ఏవిధంగా మెగాస్టార్ కంటే విజయ్ బెస్ట్ డాన్సర్ అని అందో..? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కీర్తిసురేష్ ఇప్పటికైనా తన అభిప్రాయం మార్చుకుంటుందా అని నెటిజన్లు ఎదురుచూస్తున్నారు.

 మెగాస్టార్ చిరంజీవి వీడియో ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.