Rajendra Prasad: మళ్లీ నోరుజారిన రాజేంద్రప్రసాద్.. ఆ స్టార్ హీరో పై అనుచిత వ్యాఖ్యలు.. వీడియో వైరల్..

సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇదివరకు పలు సందర్భాల్లో హీరోహీరోయిన్స్, కమెడియన్స్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చిక్కుల్లో పడ్డారు. ఇప్పుడు మళ్లీ ఓ సీనియర్ నటుడి గొప్పతనాన్ని ప్రస్తావించే క్రమంలోనే మరో స్టార్ హీరోపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీరంగంలో చర్చనీయాంశంగా మారాయి.

Rajendra Prasad: మళ్లీ నోరుజారిన రాజేంద్రప్రసాద్.. ఆ స్టార్ హీరో పై అనుచిత వ్యాఖ్యలు.. వీడియో వైరల్..
Rajendra Prasad

Updated on: Mar 11, 2026 | 10:13 AM

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాలతు తనదైన ముద్ర వేశారు నటుడు రాజేంద్రప్రసాద్. హాస్యభరిత చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఆయన.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి ఎన్నో సినిమాల్లో నటించింది. అయితే ఇటీవల సినిమాల కంటే వరుస వివాదాలతో వార్తలలో నిలుస్తున్నారు. దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. కానీ ఈమధ్య కాలంలో పలు ఈవెంట్లలో రాజేంద్రప్రసాద్ మాట్లాడే సమయంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విమర్శలకు గురవుతున్నారు. స్టేజ్ పై మాట్లాడే సమయంలో ఆయన ఉపయోగించే మాటలపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తాజాగా మరోసారి ఓ స్టార్ హీరో గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Actress : కృష్ణ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు తెలుగులో బిజీ యాక్టర్.. ఆమె వాయిస్ చాలా స్పెషల్..

భారత్ కల్చరల్ అకాడమీ, తెలుగు టెలివిజన్ కల్చరల్ వెల్పేర్ ఫోరం ఆధ్వర్యంలో రాజేంద్ర ప్రసాద్ కు కళాప్రపూర్ణ కత్తి కంతారావు జాతీయ పురస్కారం 2025ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ అలనాటి తెలుగు హీరో కాంతారావు గొప్పతనాన్ని ప్రస్తావిస్తూ తమిళ సినీ దిగ్గజం.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంతారావును చూసి ఎంజీఆర్ సైతం భయపడేవారని చెబుతూ అనుచిత పదాలు ఉపయోగించారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆ సినిమా ప్లాప్.. దెబ్బకు రోడ్డున పడ్డా.. కార్లు అమ్ముకున్నా.. టాలీవుడ్

ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రాజేంద్రప్రసాద్ మాటలపై నెటిజన్స్ విభిన్నంగా రియాక్ట్ అవుతున్నారు.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట భయ్యా.. 29 ఏళ్లుగా ట్రెండింగ్.. మనసును హత్తుకునే సాంగ్.. వింటే వదలరు..

ఎక్కువమంది చదివినవి : Jr.NTR: ఆ విషయం పదే పదే చెప్పడం నాకు నచ్చదు.. ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే తెలుసుకోవాలి.. ఎన్టీఆర్..

Follow Us