
సంగీత ప్రపంచానికి రారాజు.. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా జీవితాన్ని సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పేరుతోనే సినిమాను రూపొందిస్తున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. కెప్టెన్ మిల్లర్ మూవీ డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఇళయరాజా పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్నారు. కనెక్ట్ మీడియా.. పీకే ప్రైమ్ ప్రొడక్షన్ మెర్క్యురీ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలలో ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక ఇళయారాజా బయోపిక్ కు కమల్ హాసన్ స్క్రీన్ ప్లే రాస్తున్నట్లు సమాచారం. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈచిత్రాన్ని స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు.అయితే ఇప్పుడు ఈ పోస్టర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్స్.
తేని జిల్లాలోని ఫర్మాన్‌పురంకు చెందిన ఇళయరాజా తన సోదరుడు భవాల్‌గారి పాటల బృందంలో చేరి చిన్నతనంలో వామపక్ష సభల్లో పాడేవారు. ఆ తర్వాత సినిమాల్లో పాడాలని భావించిన ఆయన.. చెన్నైకి వచ్చి సంగీత దర్శకుడిగా అవకాశాల కోసం పలు ఆఫీసుల చుట్టూ తిరిగారు అనే.. చివరకు విజయవంతమైన మ్యూజిక్ డైరెక్టర్ గా ఎలా మారారు అనే అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. 1000 చిత్రాలకు పైగా సంగీతాన్ని అందించిన ఇళయరాజా జీవిత చరిత్రతో కూడిన సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే తాజాగా విడుదలైన పోస్టర్‌లో ఇళయరాజా చెన్నై రాగానే నేరుగా చెన్నై సెంట్రల్‌లో దిగినట్లు కనిపిస్తోంది. అయితే ఆ సమయంలో మదురై నుంచి రైలులో సెంట్రల్ ఎలా వచ్చిందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో తేని జిల్లా మధురై జిల్లాలో భాగంగా ఉండేది. కాబట్టి తేని ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే మధురై వచ్చి రైలు లేదా బస్సులో వెళ్లేవారు. ఇళయారాజా తేని ప్రాంతంలోని ఫర్మాన్‌పురం నుంచి మదురైకి రైలులో ప్రయాణించి చెన్నై సెంట్రల్‌లో ఎలా దిగాడు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడిప్పుడే తేని జిల్లాలోని బోధినాయకనూరు ప్రాంతం నుంచి మదురై మీదుగా సెంట్రల్‌కు రైలు ఉందని.. కానీ మీరు చూపించినట్లు నేరుగా ఎలా వచ్చారంటూ విమర్శిస్తున్నారు. కనీస అవగాహన లేకుండా పోస్టర్ డిజైన్ చేశారు అరుణ్ మాథేశ్వరన్, ధనుష్.. ఇంకా ఏం చేస్తారో చూస్తూ ఉండండి అంటూ సినీ విమర్శకుడు బ్లూషర్ట్ మారన్ ట్వీట్ చేశారు.
அடிப்படை ஆராய்ச்சி கூட இல்லாத போஸ்டர் டிசைன்.
அருண் மாதேஸ்வரனும், தனுஷூம்.. இன்னும் என்னவெல்லாம் செய்ய காத்துருக்காங்களோ.. pic.twitter.com/WZG2OIJWQ9
— Blue Sattai Maran (@tamiltalkies) March 21, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.