AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tripti Dimri: త్రిప్తితో కనిపించిన ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు ?.. సీరియస్ అవుతున్న ఫ్యాన్స్..

పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద యానిమల్ సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది.. ఇక నేషనల్ క్రష్ గా ఫాలోయింగ్ సంపాదించుకుంది త్రిప్తి. అంతేకాదు.. ఆమె ఇన్ స్టా ఫాలోవర్స్ సైతం పెరిగారు. ఇప్పుడు త్రిప్తి ఎక్కడ కనిపించిన క్షణాల్లో గుర్తుపట్టేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంటుంది త్రిప్తి. ఇప్పటికే భూల్ భూలయ్యా 3, ఆషికీ 3లో ఛాన్స్ కొట్టేసింది. ఇక ఇటు తెలుగులోనూ ఈ సుందరికి మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది.

Tripti Dimri: త్రిప్తితో కనిపించిన ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు ?.. సీరియస్ అవుతున్న ఫ్యాన్స్..
Tripti Dimri
Rajitha Chanti
|

Updated on: Mar 22, 2024 | 5:19 PM

Share

త్రిప్తి డిమ్రి.. ఇప్పుడు ఈ పేరు తెలియనివారుండరు. దాదాపు పదేళ్లు సినీ పరిశ్రమలో వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీకి అంతగా గుర్తింపు రాలేదు. కానీ ఇటీవల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాతో ఆ హీరోయిన్ క్రేజ్ మారిపోయింది. ఈ మూవీలో ఆమె పోషించిన జోయా పాత్రకు సెన్సెషన్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇటు సౌత్.. అటు నార్త్ లో ఫుల్ పాపులారిటీ వచ్చింది. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద యానిమల్ సినిమా భారీగా వసూళ్లు రాబట్టింది.. ఇక నేషనల్ క్రష్ గా ఫాలోయింగ్ సంపాదించుకుంది త్రిప్తి. అంతేకాదు.. ఆమె ఇన్ స్టా ఫాలోవర్స్ సైతం పెరిగారు. ఇప్పుడు త్రిప్తి ఎక్కడ కనిపించిన క్షణాల్లో గుర్తుపట్టేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంటుంది త్రిప్తి. ఇప్పటికే భూల్ భూలయ్యా 3, ఆషికీ 3లో ఛాన్స్ కొట్టేసింది. ఇక ఇటు తెలుగులోనూ ఈ సుందరికి మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. యూత్ ఫేవరేట్ క్రష్ గా మారిన త్రిప్తి ప్రేమకు సంబంధించిన ఇటీవల కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో త్రిప్తికి సంబంధించిన ఓ వీడియో వైరలవుతుంది. అందులో ఆమెతోపాటు మరో మిస్టరీ మ్యాన్ కూడా కనిపిస్తున్నాడు. అయితే అతడు త్రిప్తి ప్రియుడు సామ్ మర్చంట్ తుస్రా అని తెలిస్తోంది. వీరిద్దరు కలిసి షాపింగ్ చేస్తున్నట్లుగా ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. మాల్ నుంచి వీరిద్దరు బయటకు రాగానే వారిని ఫోటోగ్రాఫర్స్ చుట్టుముట్టారు. గ్రీన్ కలర్ టీ షర్ట్.. బ్యాగీ ప్యాంట్ ధరించి మేకప్ లేకుండా చాలా సింపుల్ లుక్ లో కనిపిస్తుంది త్రిప్తి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.

త్రిప్తితో ఉన్న ఆ మిస్టరీ మ్యా్న్ ఎవరు ?.. ఆమె ఇబ్బందిగా ఫీల్ అవుతుంది.. ఎందుకు ఫోటోస్ తీస్తున్నారు ? అంటూ మండిపడుతున్నారు. అలాగే మేకప్ లేకుండా క్యాజువల్ సింపుల్ లుక్ లో త్రిప్తి మరింత అందంగా కనిపిస్తుందని.. త్రిప్తి లుక్ న్యాచురల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. త్రిప్తి, విక్కీ కౌశల్ కలిసి నటించిన బ్యాడ్ న్యూస్ సినిమాఈ ఏడాది జూలై 19న రిలీజ్ కానుంది. 2017లో శ్రీదేవి నటించిన మామ్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది త్రిప్తి. ఆ తర్వాత పోస్టర్ బాయ్స్ సినిమాలో కనిపించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.