
భారత్‌పై పాక్ దాడులు కొనసాగుతున్నాయి. జమ్ము టార్గెట్‌గా పాకిస్తాన్ డ్రోన్ దాడులకు దిగింది. జమ్ము ఎయిర్‌పోర్ట్‌పై రాకెట్‌తో దాడి చేసింది. జమ్ములో మొత్తం ఏడు చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం వచ్చాయి. జమ్ము, కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ అమృత్‌సర్‌లో బ్లాక్‌అవుట్ చేపట్టారు. అటు జమ్ము, కశ్మీర్, అఖ్నూర్‌లో సైరన్‌లు మోగాయి. పాకిస్తాన్‌కు చెందిన మూడు యుద్ధ విమానాలును భారత్ కూల్చివేసింది. పాకిస్తాన్ ఫైటర్ జెట్ F-16తో పాటు రెండు JF-17 యుద్ధ విమానాలను కూల్చేసింది. 10 పాక్ డ్రోన్లను S400తో పేల్చేసింది. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌ను కూడా పాక్ టార్గెట్ చేసింది. మిసైల్స్, డ్రోన్లను మధ్యలోనే భారత్ నిర్వీర్యం చేసింది. యాంటీ మిస్సైల్ సిస్టమ్‌కి దొరక్కుండా.. పాకిస్తాన్ డ్రోన్లు ప్రయోగిస్తోంది. యాంటీడ్రోన్ సిస్టమ్‌తో పాక్ డ్రోన్లను కూల్చివేశారు.
సాంబా సెక్టార్‌లోనూ పాక్ దాడులకు తెగబడింది. అయితే పాక్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత సైన్యం చూపిస్తున్న ధైర్య సాహసాలను కొనియాడుతూ.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. దేశాన్ని పొగుడుతూ.. సైన్యాన్ని ప్రశంసిస్తూ.. పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు యుద్ధం గురించి రకరకాల పోస్ట్ లు పంచుకున్నారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం యుద్ధం వద్దు అంటూ పోస్ట్ చేసింది. దాంతో ఆమె పై ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఇంతకూ ఆమె ఎవరంటే..
రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకుంది ఐశ్వర్య రాజేష్. ఈ అమ్మడు తెలుగు కంటే ముందు తమిళ్ లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. అక్కడ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది. ఇప్పుడు తెలుగులో రాణిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా యుద్ధం గురించి ఆమె చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపాయి. “యుద్ధానికి నో చెప్పండి. ఈ దేశ పౌరురాలిగా నేను ఇండియా, పాకిస్థాన్ ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నాను. యుద్దానికి బదులు శాంతికి ప్రాధాన్యం ఇవ్వండి. అనవసరంగా ప్రాణాలు గాల్లో కలిసిపోకుండా చూద్దాం. సైనికులు, నైపుణ్యం ఉన్న వ్యక్తులు, అమాయక పౌరులు చనిపోకూడదు. దీనిపై అవగాహన కల్పించి, మరో యద్ధం రాకుండా చర్యలు తీసుకోవాలి అంటూ రాసుకొచ్చింది ఐశ్వర్య రాజేష్. దాంతో ఆమె పోస్ట్ పై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. ఆమె కనీస అవగాహనా లేకుండా మాట్లాడుతుంది అంటూ మండిపడుతున్నారు కొందరు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.