Liger Trailer: ‘ఆమె కళ్లు అన్ని చెప్పేస్తాయి.. ఇండస్ట్రీకి లేడీ మాఫియా’.. రమ్యకృష్ణ నటనకు నెటిజన్స్ ఫిదా.. 

|

Jul 21, 2022 | 6:35 PM

తాజాగా విడుదలైన ట్రైలర్ లో ఆమె.. ఆహార్యం, డైలాగ్స్ పలికిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కొడుకు ఫైటర్ గా రాణించేందుకు ఎంతకైనా తెగించే ధైర్యవంతురాలైన అమ్మగా కనిపించారు

Liger Trailer: ఆమె కళ్లు అన్ని చెప్పేస్తాయి.. ఇండస్ట్రీకి లేడీ మాఫియా.. రమ్యకృష్ణ నటనకు నెటిజన్స్ ఫిదా.. 
Ramya Krishna
Follow us on

సోషల్ మీడియాను షేక్ చేస్తుంది లైగర్ (Liger ) ట్రైలర్. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ (vijay devarakonda) కాంబోలో రాబోతున్న ఈ చిత్రం పై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై మరింత హైప్ తీసుకురాగా.. ఇక ఈరోజు విడుదలైన ట్రైలర్ సినిమా ఏ రెంజ్‏లో ఉండనుందో తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. ట్రైలర్‏లో విజయ్ మేకోవర్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. మరోవైపు సోషల్ మీడియా వేదికగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. ఇందులో విజయ్ తల్లిగా ఆమె కనిపించనుంది.

తాజాగా విడుదలైన ట్రైలర్ లో ఆమె.. ఆహార్యం, డైలాగ్స్ పలికిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కొడుకు ఫైటర్ గా రాణించేందుకు ఎంతకైనా తెగించే ధైర్యవంతురాలైన అమ్మగా కనిపించారు. ” ” సౌత్ ఇండియన్ ఇండస్ట్రికీ వన్ అండ్ ఓన్లీ లేడీ మాఫియా” అని ఒక యూజర్ క్యాప్షన్ ఇవ్వగా.. ఆమె పవర్ ఫుల్ కళ్లు అన్ని చెప్పే్స్తాయి.. ఆమె క్వీన్ అని చెప్పడానికి చాలా కారణాలున్నాయి. లైగర్ ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి.. అంటూ మరొకరు కామెంట్ చేశారు. లైగర్ ట్రైలర్ లో రమ్యకృష్ణను చూసి థ్రిల్ అయ్యాను. ఆమె పవర్ ఫుల్ పాత్రను చూసి చూపు తిప్పుకోలేకపోయాను.. బాహుబలి సినిమాలోని శివగామి పాత్రలు మరిపించింది.. అంటూ మరోకరు క్యాప్షన్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.