Megastar Chiranjeevi: చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీలో హీరోయిన్ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్..

మెగాస్టార్ చిరంజీవి సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విశ్వంభర మూవీతో బిజీగా ఉన్న చిరు.. ఆ తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

Megastar Chiranjeevi: చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీలో హీరోయిన్ ఫిక్స్.. అధికారికంగా ప్రకటించిన మేకర్స్..
Chiranjeevi, Anil Ravipudi

Updated on: May 17, 2025 | 12:16 PM

ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. ఇందులో చిరు సరసన త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతోపాటు చిరు చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ పై సైతం మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విశ్వంభర తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు చిరు. వీరిద్దరి కాంబోలో పక్కా సాలిడ్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ రానున్నట్లు తెలుస్తోంది. దీంతో ముందు నుంచి ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ మూవీలో నటించే హీరోయిన్ ఎవరనే విషయంపై రోజుకో రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

కొన్నాళ్లుగా ఈ ప్రాజెక్ట్ పై అనేక అప్డేట్స్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇందులో చిరు సరసన మరోసారి నయనతార నటించనుందని.. కానీ ఈ సినిమా కోసం ఆమె భారీగా పారితోషికం డిమాండ్ చేస్తుందని వార్తలు వినిపించాయి. అలాగే టాలీవుడ్, కోలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ పేర్లు సైతం తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ మూవీ హీరోయిన్ ఎవరనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా కనిపించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఆమెపై కంప్లీట్ తెలుగులో సూపర్ ఫన్ వీడియో రిలీజ్ చేసి తమ అవైటెడ్ ప్రాజెక్టులోకి ఆహ్వానం పలికారు. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయనున్నారు. గతంలో చిరు, నయన్ కలిసి సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరు జోడికి తెలుగు ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉంది. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి జంట స్క్రీన్ పై సందడి చేయనుంది.

ఇవి కూడా చదవండి :  

 Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..