
దక్షిణాదిలో టాప్ హీరోయిన్లలో నయనతార ఒకరు. 20 ఏళ్లుగా సినిమాల్లో కొనసాగుతుంది. ఈరోజు నయనతార పుట్టినరోజు (నవంబర్ 18). ప్రస్తుతం ఆమె వయసు 41 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో మెస్మరైజ్ చేస్తుంది. తన అందం, తేజస్సు, ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇంతకీ నయన్ అందం రహస్యం ఏంటో తెలుసా.. ? అయితే ఇప్పుడు తెలుసుకోవాల్సిందే. గతంలో తన స్కిన్ కేర్ బ్రాండ్ ప్రమోషన్లలో భాగంగా తన బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసింది నయన్. ఆమె ఎక్కువగా ప్రాంతీయ ఆహార పదార్థాలను, కాలానుగుణంగా ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటుంది.
ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..
ఆమె ఆహారపు అలవాట్లతో పాటు, హైడ్రేటెడ్ గా ఉండేందుకు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. లిప్స్ పై తాను ఫౌండేషన్ ఉపయోగిస్తానని.. పెదవులను లిప్ లైనర్‌తో ఓవర్‌లైన్ చేస్తానని తెలిపింది. నయనతార తన ఫిట్‌నెస్ గురించి చాలా స్పృహతో ఉంటుంది , ప్రతిరోజూ వ్యాయామం చేస్తుంది. కార్డియో, వెయిట్ ట్రైనింగ్, ఫిట్‌నెస్ వ్యాయామాలు చేస్తుంది. ఆమె క్రాష్ డైట్‌లను పాటించదు.
Bigg Boss 9 Telugu: సీన్ మారింది.. బిగ్‌బాస్ దుకాణం సర్దేయాల్సిందే.. ఓర్నీ మరి ఇంత అట్టర్‌ఫ్లాపా..
ఆమె పండ్లు, కూరగాయలు, మాంసం, గుడ్లు, ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఏదైనా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటుంది. అలాగే ఎక్కువగా కొబ్బరి నీళ్లు తీసుకుంటుంది. అలాగే కొబ్బరి స్మూతితో రోజూ ప్రారంభిస్తుంది. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. అలాగే నయన్ చక్కెర అస్సలు తీసుకోదు. నయనతార తన ఆహారంలో కొబ్బరి నీళ్ళు మాత్రమే కాకుండా పండ్ల రసాలు, సూప్‌లు, ప్రతిరోజూ 4-5 లీటర్ల నీటిని తీసుకుంటుంది.
ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..