Naresh- Pavitra: ఆమె వచ్చాకే నాన్న ఇలా మారిపోయాడు.. నరేశ్- పవిత్రల గురించి కుమారుడు నవీన్ ఏమన్నాడంటే?

ప్రముఖ సీనియర్‌ నటుడు నరేశ్‌, నటి పవిత్రా లోకేశ్‌ చాలా కాలంగా కలిసే ఉంటున్నారు. సినిమా ఈవెంట్స్, ఫంక్షన్లు, పార్టీలకు కలిసే హాజరవుతున్నారు. మరి వీరి రిలేషన్ షిప్ పై నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ ఏమంటున్నారో తెలుసుకుందాం రండి.

Naresh- Pavitra: ఆమె వచ్చాకే నాన్న ఇలా మారిపోయాడు.. నరేశ్- పవిత్రల గురించి కుమారుడు నవీన్ ఏమన్నాడంటే?
Naresh, Pavitra

Updated on: Feb 22, 2026 | 3:35 PM

సీనియర్‌ నటుడు నరేశ్‌ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నారు. సహాయక నటుడిగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నారు. సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారీ సినిమాతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ఆయన లేటెస్ట్ గా హే బలవంత్ సినిమాతో మరోసారి మన ముందుకు వచ్చారు. గత శుక్రవారం (ఫిబ్రవరి 20) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డీసెంట్ టాక్ తో నడుస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. తన వ్యక్తిగత జీవితంలోనూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు నరేష్. సీనియర్ నటి పవిత్రా లోకేశ్ తో చాలా కాలంగా కలిసే ఉంటున్నరాయన. ‘మళ్లీ పెళ్లి’ సినిమాలో భార్య భర్తలుగా నటించిన వీరిద్దరూ రియల్ లైఫ్ లోనూ కలిసే జీవిస్తున్నారు. సినిమా ఈవెంట్స్, ఫంక్షన్లు, పార్టీలకు జంటగానే హాజరవుతున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి గురించి నరేశ్‌ కుమారుడు, నటుడు నవీన్‌ విజయ్‌ కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

గతంలో పలు సినిమాల్లో హీరోగా నటించాడు నవీన్ విజయ్ కృష్ణ. నందిని నర్సింగ్‌ హోమ్‌, ఊరంతా అనుకుంటున్నారు వంటి పలు సినిమాల్లో హీరోగా నటించాడు. దర్శకుడిగా సత్య అనే షార్ట్‌ ఫిలిం తీశాడు. అయితే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు నవీన్. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అతను తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అలాగే నరేష్- పవిత్రల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘నటుల జీవితం చాలా కష్టతరంగా ఉంటుంది. వాళ్లందరూ ఏ కష్టం, బాధ వచ్చినా బయటకు చెప్పుకోరు. బాత్రూమ్‌లోనే ఏడుస్తారు. అలా కన్నీళ్లు పెట్టుకోని యాక్టర్స్‌ ఉండరు. పవిత్ర లోకేశ్‌ చాలా మంచి మనిషి. ఆమెను తరచూ కలుస్తుంటాను. ఆవిడ అందరినీ ప్రేమగా పలకరిస్తుంటుంది. అందరితోనూ ఇట్టే కలిసిపోతుంది. నాన్నకు సరైన జోడీ అని నా అభిప్రాయం. ఆమె ఉన్నప్పుడు నాన్న కూడా సైలెంట్‌గా ఉంటాడు. 50 ప్లస్ ఏజ్‌లో నాన్న ఇంత ప్రశాంతంగా ఉండటానికి ఆమెనే కారణం. ప్రేమకు ఎటువంటి హద్దులు లేవనడానికి ఇది నిదర్శనం. పవిత్ర- నాన్నల బంధాన్ని నిర్మల నానమ్మ, కృష్ణ తాతయ్య కూడా స్వాగతించారు. నాన్న ఏ నిర్ణయం తీసుకున్నా సరే నానమ్మ- తాతయ్య సపోర్ట్‌ చేసేవారు. పవిత్ర వచ్చాక నాన్న చాలా సంతోషంగా ఉన్నాడు’ అని చెప్పుకొచ్చాడు నవీన్. ప్రస్తుతం అతని కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us