Naveen Polishetty: బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న జాతిరత్నం.. ఆ అవార్డును ఎవరికీ అంకితమిచ్చాడో తెలుసా..?

సహజమైన నటనతో ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి. హీరోగా చేసింది రెండు సినిమాలే అయినా ప్రేక్షకులు చాలా దగ్గరయ్యాడు నవీన్.

Naveen Polishetty: బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న జాతిరత్నం.. ఆ అవార్డును ఎవరికీ అంకితమిచ్చాడో తెలుసా..?
Naveen Polishetty
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 13, 2022 | 8:27 PM

సహజమైన నటనతో ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty). హీరోగా చేసింది రెండు సినిమాలే అయినా ప్రేక్షకులు చాలా దగ్గరయ్యాడు నవీన్. ఈ కుర్ర హీరో నటించిన జాతిరత్నాలు సినిమా కోవిడ్ టైమ్ లో రిలీజ్ అయ్యి ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 70  కోట్ల రూపాయల వసూళ్లు సాధించి ఆ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమా నవీన్ కు  సైమా బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్) అవార్డునూ సంపాదించి పెట్టింది. తాజాగా జరిగిన సైమా అవార్డ్స్ లో జాతి రత్నాలు చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా పురస్కారం గెల్చుకున్నారు నవీన్ పోలిశెట్టి. ఈ సినిమాకు అనుదీప్ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా నవీన్ పోలిశెట్టి స్పందిస్తూ…నేను సినిమా హీరో అవుతానని చెబితే..అలాంటి కలలు కనకు అని అనేవారు. ఇవాళ నా కల నిజమైంది. సైమాలో బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్) అవార్డ్ అందుకోవడం మర్చిపోలేని అనుభూతిని ఇస్తోంది. నేను అభిమానించే హీరోలు అల్లు అర్జున్, రన్వీర్ సింగ్ సమక్షంలో అవార్డ్ అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ పురస్కారం ఇచ్చిన స్ఫూర్తితో మరింత కష్టపడి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తాను. ప్రతి సాధారణ యువకుడికి ఈ అవార్డ్ ను అంకితం ఇస్తున్నా. మీరూ కష్టపడి, ప్రయత్నిస్తే నాలాగే అనుకున్నది సాధించగలరు అని అన్నారు. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో అనుష్క శెట్టి నాయికగా నటిస్తున్నది. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. వచ్చే ఏడాది విడుదల కానున్న నవీన్ అనుష్క సినిమాపై మంచి అంచనాలున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..