టాలీవుడ్ హీరో నవదీప్ చాలా కాలం తర్వాత ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. 2004లో వచ్చిన జై సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మొదటి సినిమా, గౌతమ్ ఎస్ ఎస్ సీ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినప్పటికీ సాలిడ్ సక్సెస్ మాత్రమందుకోలేకపోయాడు. 2007లో వచ్చిన చందమామ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఆతర్వాత సెకండ్ హీరోగా మారాడు. ఆర్య 2 సినిమాలో సెకండ్ హీరోగా నటించి మెప్పించాడు. ఆతర్వాత వరుసగా సెకండ్ హీరోగా మారి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. చాలా కాలం తర్వాత ఇప్పుడు హీరోగా మారి సినిమా చేస్తున్నాడు. లవ్ మౌళి అనే సినిమాతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నవదీప్.
ఈ సినిమాలో నవదీప్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది.అలాగే ఈ సినిమాలో నవదీప్ పెయింటర్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో చాలా రొమాంటిక్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాకు రొమాంటిక్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ హైలైట్ గా ఉంటాయని తెలుస్తోంది.
ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో ఏకంగా 42 లిప్ లాక్ సీన్లు ఉన్నాయని తెలుస్తోంది. గతంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో 25 లిప్ లాక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ రికార్డ్‌ను బద్దలు కొట్టేలా ఏకంగా మూవీలో ఏకంగా 42 లిప్ లాక్ సీన్లు ఉంటాయని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో బోల్డ్ సీన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని తెలుస్తోంది. జూన్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో నవదీప్ హీరోగా స్ట్రాంగ్ రీ ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.