Ante Sundaraniki: కంప్లీట్ కామెడీ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా అంటే సుందరానికి.. ట్విట్టర్ రివ్యూ

నేచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరనికి సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వచ్చిన ఈ సినిమాలో మలయాళ ముదుగుమ్మ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించింది.

Ante Sundaraniki: కంప్లీట్ కామెడీ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా అంటే సుందరానికి.. ట్విట్టర్ రివ్యూ
Nani

Updated on: Jun 10, 2022 | 9:26 AM

నేచురల్ స్టార్ నాని(Natural star Nani) నటించిన అంటే సుందరానికి(Ante Sundaraniki) సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వచ్చిన ఈ సినిమాలో మలయాళ ముదుగుమ్మ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో నజ్రియా నేరుగా తెలుగులోకి అడుగు పెట్టింది. కామెడీ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన అంటే సుందరానికి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.  ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమా పై  మొదటి నుంచి పాజిటివ్ బజ్ ఉంది. ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాంతో సినిమా పై అంచనాలు భారీ గా పెరిగాయి.

కంప్లీట్ కామెడీ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాని ఓ బ్రాహ్మణ కుర్రాడిగా, నజ్రియా క్రిస్టియన్‌ అమ్మాయిగా నటించింది.. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల సినిమా ప్రదర్శన మొదలైంది. మంచి అంచనాల నడుమ రిలీజ్ అయినా అంటే సుందరానికి సినిమా ఎలా ఉందో.. ట్విట్టర్ ద్వారా తమ రివ్యూని తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి