National Cinema Day: సినిమా అనేది ఎప్పుడు.. ఎక్కడ పుట్టిందో తెలుసా..!!

సినిమా అనేది అతి పెద్ద మాధ్యమం.  1894లో థామస్ ఎడిసన్ "కైనెటో గ్రాఫ్" (కెమెరా), "కైనెటోస్కోప్" (ప్రొజెక్టర్) అనే రెండు పరికరాలను కనిపెట్టాడు. . ఆతర్వాత బ్రిట్‌పాల్ అనే పరిశోధకుడు 1895లో యూరోప్‌లో ఒక "ఫిల్మ్ ప్రొజెక్టరు కనిపెట్టాడు. ఫ్రాన్స్‌లో లూమిరె సోదరులు (ఆగస్టు లూమిరె, లూయిస్ లూమిరె) 1895లో ఒక సూట్‌కేసు సైజులో ఉన్న సినిమాటోగ్రాఫ్ పరికరాన్ని తయారు చేశారు.

National Cinema Day: సినిమా అనేది ఎప్పుడు.. ఎక్కడ పుట్టిందో తెలుసా..!!
Movies

Updated on: Oct 13, 2023 | 8:13 AM

మన దేశం ఎక్కువగా జనాలు ఇష్టపడేవి రెండే రెండు ఒకటి క్రికెట్ రెండు సినిమా. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం లో సినిమా అతి పెద్ద పాత్ర వహిస్తుంది. నేడు అంతర్జాతీయ సినిమా దినోత్సవం. సినిమా అనేది అతి పెద్ద మాధ్యమం.  1894లో థామస్ ఎడిసన్ “కైనెటో గ్రాఫ్” (కెమెరా), “కైనెటోస్కోప్” (ప్రొజెక్టర్) అనే రెండు పరికరాలను కనిపెట్టాడు. . ఆతర్వాత బ్రిట్‌పాల్ అనే పరిశోధకుడు 1895లో యూరోప్‌లో ఒక “ఫిల్మ్ ప్రొజెక్టరు కనిపెట్టాడు. ఫ్రాన్స్‌లో లూమిరె సోదరులు (ఆగస్టు లూమిరె, లూయిస్ లూమిరె) 1895లో ఒక సూట్‌కేసు సైజులో ఉన్న సినిమాటోగ్రాఫ్ పరికరాన్ని తయారు చేశారు. దీని ద్వారా కదిలే బొమ్మలను సృష్టించారు. దాంతో జనల దగ్గర డబ్బులు వసూల్ చేసి ఆ కదిలే బొమ్మలను చూపించేవారు. అసలు సినిమా పుట్టుకకు ఇక్కడే బీజం పడిందని చెప్పాలి.

ఆతర్వాత ఎన్నో మార్పులు చేర్పులతో సినిమా అనేది డవలప్ అయ్యింది. మొదట్లో సౌండ్ లేకుండా కేవలం బొమ్మలతోనే సినిమాను సృష్టించారు. ఆ తర్వాత సౌండ్ ను కనిపెట్టారు. సౌండ్ కనిపెట్టక ముందు దాదాపు 30 ఏళ్ళు సౌండ్ లేకుండా సినిమాలను జనాలకు చూపించారు. ఆ తర్వాత సౌండ్ ను కనిపెట్టారు. 1922లో బెర్లిన్‌లో మొదటి సారి సౌండ్ తో కూడిన సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమాలో

1923 నుండి న్యూయార్క్‌లో ప్రేక్షకులు డబ్బులిచ్చి “టాకీ” ను చూడడం ప్రారంభించారు. ఆతర్వాత సినిమా అనేది జనాల్లోకి వెళ్లడం మొదలైంది. మెల్లగా జనాలు సినిమాను ఆస్వాదించడం మొదలు పెట్టారు. 1928లో “ది లైట్స్ ఆఫ్ న్యూయార్క్ ” అనే పూర్తి సౌండ్ తో కూడిన చిత్రం వచ్చింది. ఇక మన తెలుగులో మొదటి సినిమా 1931లో వచ్చింది. తెలుగులో మొదటి సినిమా భక్త ప్రహ్లద. అలాగే హిందీలో ఆలం ఆరా అనే సినిమా మొదటిగా వచ్చింది. ఈ సినిమా కూడా 1931 లోనే వచ్చింది. ఇక ఇప్పుడు సినిమాఅనేది ఎలా మారిపోయిందో అందరికి తెలిసిందే. సినిమాల్లో ముందుగా బ్లాక్ అండ్ వైట్ వచ్చాయి. ఆ తర్వాత 1906లో జార్జ్ ఆల్బర్ట్ స్మిత్ “కైనెమాకలర్” పేరుతో రెండు రంగుల సినిమాను తెరకెక్కించాడు. 1932లో “టెక్నికలర్” అనే మూడు రంగుల సినిమాను తెరకెక్కించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..