HIT 3 Movie: నాని సినిమాకు గుడ్ న్యూస్.. ఆ విషయంలో సర్కార్ గ్రీన్ సిగ్నల్..

సాధారణంగా న్యాచురల్ స్టార్ నాని సినిమాలకు జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. పక్కింటి అబ్బాయిల కనిపిస్తూ సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు నాని. ఇన్నాళ్లు లవర్ బాయ్, ఫ్యామిలీ పర్సన్ పాత్రలతో మెప్పించిన నాని.. ఇప్పుడు మాస్ యాక్షన్ పాత్రతో రఫ్పాడించేందుకు రెడీ అయ్యాడు.

HIT 3 Movie: నాని సినిమాకు గుడ్ న్యూస్.. ఆ విషయంలో సర్కార్ గ్రీన్ సిగ్నల్..
HIT 3 Movie Review

Updated on: Apr 30, 2025 | 1:04 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పరాజయమెరుగని హీరోల్లో న్యాచురల్ స్టార్ నాని ఒకరు. వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. హిట్టు, ప్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా విభిన్నమైన కంటెంట్ కథలను ఎంచుకుంటున్నాడు. ఇప్పటివరకు పక్కింటి అబ్బాయిల కనిపించిన నాని.. ఇప్పుడు మాస్ యాక్షన్ హీరోగా, అర్జున్ సర్కార్ పాత్రలో రఫ్పాడించేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం నాని నటిస్తోన్న లేటేస్ట్ మూవీ హిట్ 3. గతంలో సూపర్ హిట్ అయిన హిట్ సిరీస్ కు సీక్వెల్ ఇది. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం రేపు అంటే మే 1న విడుదల కానుంది. దీంతో కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు నాని.

పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనుండడంతో దేశవ్యాప్తంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు నాని. ఇప్పటికే ట్రైలర్, టీజర్ హిట్ 3 పై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేశాయి. మరికొన్ని గంటల్లోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే నాని సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చిత్రయూనిట్ విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమా టికెట్ ధరలు పెంచుకునేలా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ చేసింది.

ధరల విషయానికి వస్తే.. సింగిల్ స్క్రీన్స్ లో రూ.50 (జీఎస్టీతో), మల్టీప్లెక్స్ లో రూ.75 (జీఎస్టీతో) పెంచుకునేలా వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా విడుదలైన నాటి నుంచి వారంపాటు అదనపు ధరలు అమల్లో ఉండనున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై మూవీ టీం హర్షం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పూర్తయ్యింది. ఈ చిత్రానికి సెన్సార్ టీం ఎ సర్టిఫికెట్ జారీ చేసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కొన్ని మార్పులు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..