Shyam Singha Roy : నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమా ప్రతుతం థియేటర్స్ లో సందడి చేస్తుంది. రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. కలకత్తా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని రెండు విభిన్నమైన పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటించారు. అలాగే కీలక పాత్రలో మడోన్నా సెబాస్టియన్ కనిపించి ఆకట్టుకున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత నాని సినిమా థియేటర్స్ లో సందడి చేస్తుంది. గతంలో నాని నడిచిన వి , టక్ జగదీష్ సినిమాలు ఓటీటీలో విడుదలై ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేక పోయాయి. దానితో శ్యామ్ సింగ రాయ్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విడుదలకు ముందే ఈ సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. పోస్టర్లు, టీజర్ , ట్రైలర్ , పాటలతో సినిమా పైన ఆసక్తిని పెంచారు చిత్రయూనిట్.
ఇక ఈ సినిమా విడుదల తర్వాత పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. విడుదలైన అన్ని ఏరియాలనుంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అమెరికాలోను శ్యామ్ సింగ రాయ్ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుంది. 2వ వారంలో శ్యామ్ సింగరాయ్ కి 10 నుంచి12 కొత్త థియేటర్లు జోడించేందుకు అమెరికా పంపిణీ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇక యుఎస్ఏ లో శ్యామ్ సింగరాయ్ సినిమా 200 థియేటర్స్ లో ఆడుతుంది. ఇప్పటివరకు శ్యామ్ సింగరాయ్ 550 కే డాలర్స్ ( 4 కోట్ల రూపాయలకు పైగా) వసూళ్లను సాధించింది. ఇక శ్యామ్ సింగారాయ్ సినిమాలో నాని నటన.. సాయి పల్లవి పర్ఫామెన్స్ చాలా ప్లస్ అయ్యాయి. ఓ వైపు అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా రాణిస్తున్నపటికీ శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లను రాబడుతుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :