‘వి’ మూవీ : నాని ల‌వ‌ర్ బాయ్ లుక్ అద‌ర‌హో !

యువ హీరోలు నాని, సుధీర్‌బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'వి'. ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

వి మూవీ : నాని ల‌వ‌ర్ బాయ్ లుక్ అద‌ర‌హో !

Updated on: Sep 04, 2020 | 5:25 PM

యువ హీరోలు నాని, సుధీర్‌బాబు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘వి’. ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. నివేదా థామస్‌, అదితిరావు హైదరీ హీరోయిన్స్‌. శనివారం అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నాని ఈ చిత్రంలోని ఓ స్పెషల్‌ ఫొటోను నెటిజ‌న్ల‌తో పంచుకున్నారు.

నాని ఇందులో నెగ‌టీవ్ షేడ్స్ ఉన్న పాత్ర‌ సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రోమోలు, ట్రైలర్‌లో గుబురు గడ్డం, మెలి తిరిగిన మీసంతో ర‌ఫ్ లుక్‌తో క‌నిపించిన నాని తాజా ఫొటోలో లవర్‌బాయ్‌లా అద‌ర‌గొట్టారు. అదితిరావు హైదరీని కౌగలించుకుని తీక్ష‌నంగా చూస్తోన్న‌ ఫొటో ఆకట్టుకుంటోంది. మరి నాని విలన్‌గా మారడానికి రీజ‌న్ ఏంటి? అందుకు కార‌కులు ఎవ‌రు? ఎలాంటి పరిస్థితుల్లో మారాల్సి వచ్చింది? విల‌న్ అవ‌తారం ఎత్తిన తర్వాత ఎదురైన పరిస్థితులు ఏంటి? తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

 

Read More :

కేజీ చేప‌లు రూ.10 : అయినా కొనుగోలు చేయ‌ని ప్ర‌జ‌లు !

ఐటీబీపీకి హోంశాఖ ఆర్డ‌ర్స్ , హైఅలర్ట్​

మరో ఆశాకిరణం! కరోనాను ఎదుర్కొనే కొత్త వ్యాక్సిన్ !