Dasara: దసరా ఓటీటీ రిలీజ్‌లో సూపర్ ట్విస్ట్.. ఏకంగా రెండు ఫ్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్.?

|

Mar 31, 2023 | 8:58 AM

డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్  ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కింది. ఈ సినిమాలో నాని మునుపెన్నడూ కనిపించనంత మాస్ క్యారెక్టర్ లో కనిపించి ఆకట్టుకున్నారు.

Dasara: దసరా ఓటీటీ రిలీజ్‌లో సూపర్ ట్విస్ట్.. ఏకంగా రెండు ఫ్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్.?
Dasara
Follow us on

నేచురల్ స్టార్ నాని హిట్ కొట్టేశాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన దసరా మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్  ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కింది. ఈ సినిమాలో నాని మునుపెన్నడూ కనిపించనంత మాస్ క్యారెక్టర్ లో కనిపించి ఆకట్టుకున్నారు. మొన్నటి వరకు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాని ఈ సినిమాతో మాస్ లోనూ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమాలో నానికి జోడీగా కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా పై మొదటి నుంచి గట్టి నమ్మకంతో ఉన్నాడు నాని. ఇక మార్చి 30న శ్రీరామ నవమి సందర్భంగా విడుదలైన ఈ సినిమా భారీ ఓపినింగ్స్ ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ గురించి ఆస్కతికర చర్చ జరుగుతోంది. దసరా మూవీ రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.

దసరా సినిమా పాన్ ఇండియా మూవీ రిలీజ్ అయినా విషయం తెల్సిందే. అయితే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందట. అలాగే  హిందీ వెర్షన్ హక్కులు మాత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుందని తెలుస్తోంది.

దాంతో దసరా హిందీ వర్షన్ డిస్నీలో స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది. ఈ రెండు ఓటీటీ సంస్థలు భారీ మొత్తానికి దసరా హక్కులను కొనుగోలు చేశాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక దసరా సినిమా రిలీజ్ కు ముందే భారీ బిజినెస్ చేసింది. థియేట్రికల్ బిజినెస్ ఏకంగా 50 కోట్ల వరకు జరిగిందని తెలుస్తోంది. ఇది నాని కెరీర్ లోనే హైయెస్ట్.