నందిత శ్వేతా, మాన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “జెట్టి”. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకుడు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న “జెట్టి” సినిమా ట్రైలర్ ను నటసింహం బాలకృష్ణ విడుదల చేశారు. ట్రైలర్ బాగుందన్న ఆయన..చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు.
“జెట్టి” ట్రైలర్ చూస్తే…నా ఆశ కంటే మా నాన్న ఆశయం ముఖ్యం హీరోయిన్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఊరికి జెట్టిని తీసుకురావాలనే తండ్రి ఆశయాన్ని సాధించేందుకు కూతురుగా రాజీలేని పోరాటం చేస్తుంది. జెట్టి వల్ల పర్యాటకం పెరిగి ఊరు బాగుపడుతుంది. జనం బాగుపడటం ఇష్టంలేని విలన్లు జెట్టి కాదు కదా మట్టిని కూడా తీసుకురానివ్వం అంటూ అడ్డుపడుతుంటారు. హీరో మాన్యం కృష్ణ మాన్యం అనే పాత్రలో నటించారు. అతని సహాయంతో ఈ ప్రతినాయకుల స్వార్థాన్ని నాయిక ఎలా ఎదుర్కొంది, వీళ్లంతా ఊరికి జెట్టిని తీసుకొచ్చారా లేదా అనేది ఆసక్తికరంగా ఉండబోతోంది. సినిమా మత్స్యకార జీవనం, స్థితిగతులు, వారి జీవనంలోని భావోద్వేగాలను సహజంగా చూపించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :