AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bimbisara : కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ మూవీ ‘బింబిసార’ రిలీజ్ అయ్యేది అప్పుడే..

నందమూరి కళ్యాణ్ రామ్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కెరీర్ బిగినింగ్ నుంచి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు.

Bimbisara : కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ మూవీ 'బింబిసార' రిలీజ్ అయ్యేది అప్పుడే..
Bimbisara
Rajeev Rayala
|

Updated on: Apr 03, 2022 | 3:45 PM

Share

నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కెరీర్ బిగినింగ్ నుంచి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న మూవీ ‘బింబిసార’. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్. వ‌శిష్ఠ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 18వ చిత్రమిది. రీసెంట్ ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేశారు చిత్రయూనిట్. బింబిసార చిత్రాన్ని ఆగ‌స్ట్ 5న విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా నుంచి విడుద‌లైన క‌ళ్యాణ్ రామ్ ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌, టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి.

‘బింబిసార‌లో విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్ కీల‌కంగా ఉండ‌బోతున్నాయి. భారీ సెట్స్‌తో క‌ళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న హై టెక్నిక‌ల్ వేల్యూస్ మూవీ ఇది. ఆగ‌స్ట్ 5న సినిమాను విడుద‌ల చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. కళ్యాణ్ రామ్ సరసన కెథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ప్ర‌ముఖ సీనియ‌ర్‌ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి నేప‌థ్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఆ మధ్య విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jayaprada: వెండితెరపై వెన్నెల సంతకం..భారతీయ స్త్రీ సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం..అచ్చ తెలుగమ్మాయి జయప్రద పుట్టిన రోజు నేడు..

Shraddha Kapoor: ట్రెడిషినల్ వేర్ లో శ్రద్ధా కపూర్ ఉగాది ట్రీట్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్

Sreemukhi: పింక్ డ్రెస్ లో మెరిసిపోతున్న బబ్లీ బ్యూటీ.. శ్రీముఖి లేటెస్ట్ ఫోటోస్

Follow Us